Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గడ్డు కాలం

[యామిని కోళ్ళూరు గారు రచించిన ‘గడ్డు కాలం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]

చేతనైనా ఏదో తెలియని అసహాయత
చేసే పనిలో వుండాలి నిబద్ధత
చేసినా నినదించేరు నీలోని సమర్ధత
చేదులా ఆవహించే అన్నింటా నిస్సహాయత
చేతకాక కాదు ఏమిటో తెలియని నిర్లిప్తత..

ఎవరిది తప్పు అని ప్రశ్నించేలా ఆలోచన
ఎదుటివారిలో అయ్యేవు నీవు చులకన
ఎందరెన్ని చెప్పినా లేదా అనేలా అవగాహన
ఏవో భయాలతో అన్నింటికి దూరంగా‌ జరిగిన
ఎందరెందరో చేసిన చులకన మాటలు వెంటాడిన..

కనికరము లేని కాలమా అని నినదించక
కష్టాల కడలిలో కూరుకు పోయిన
కష్టంవేళ నా అనేవారు నిను ఆదుకొనిన
కనిపించనేలేదని నిను పలకరింపులోనే తులనాడిన
కనుల వెంట తన్నుకొని జలధార ఉబికి వచ్చిన..

నాకు జరిగిందని నాకే ఎందుకిలా అని
నాలో నేను సంధించుకున్న ప్రశ్నల బాణాలు
నాసున్నిత మనసుకి తెలుసు నా వ్యథ
నా చేతనైనా సాయం పొంది
నాకు నమ్మకద్రోహం చేసిన అది మోసం అని
నా మితిమీరిన నమ్మకమే ప్రమాద అంచుల్లో నెట్టిన..
నాకు వచ్చిన గడ్డుకాలం అనే పరీక్షలో నెగ్గుతూ
ముందుకు సాగాలి జీవనంలో..

Exit mobile version