[జీ.వీ.యస్. ఆచార్యులు గారు రచించిన ‘గమ్యమెక్కడో’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
పేగు బంధాన్ని తప్ప
పేరున్న ఏ బంధాన్ని
గుర్తించలేని పసి బాల్యంతో మొదలై
పెరిగే వయసుతో పెనవేసుకుపోతున్న
బహు బంధాల బాహువులలో చిక్కి
ఉక్కిరిబిక్కిరి అయ్యే వృద్ధాప్యం వరకూ
గమ్యమెక్కడో తెలియని
సంసార జీవన సాగరం లో
ఆటుపోట్ల అంతర్మథనాలెన్నో
ఎండమావిలాంటి నిశ్శబ్ధ ఏకాంతలెన్నో..
