Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘గెలిచేదాకా పోరాడు..’ – ధారావాహిక ప్రారంభం – ప్రకటన

శ్రీమతి పెబ్బిలి హైమవతి రచించిన ‘గెలిచేదాకా పోరాడు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.

~

సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన రవి, తన ప్రతిభను నమ్మి తల్లి అన్నపూర్ణ పేరుతో సొంతంగా కన్స్ట్రక్షన్ వ్యాపారం ప్రారంభిస్తాడు. శృతితో నిశ్చితార్థం జరిగి, స్నేహితులు శివ, శ్రీనుల సహాయంతో ప్రాజెక్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసే సమయానికి, వ్యాపార శత్రువు జగదీశ్వరరావు చేసిన కుట్ర వల్ల ఆ భవనం కూలిపోతుంది. ఈ ఘోర ప్రమాదంతో ఆస్తులన్నీ కోల్పోయామని తెలిసి రవి తండ్రి గుండె ఆగి మరణించగా, తల్లి మతిస్థిమితం కోల్పోతుంది. అటు ఫ్లాట్స్ బుక్ చేసుకున్న వారి ఒత్తిడి, ఇటు సర్వస్వం కోల్పోయాడని శృతి తండ్రి పానకాలరావు పెళ్లిని రద్దు చేయడం వంటి వరుస ఆఘాతాలతో రవి తీవ్ర మానసిక క్షోభకు గురవుతాడు. ఏ చిన్న కష్టం వచ్చినా జీవితాన్ని ముగించాలనుకునే నేటి యువతరంలా కాకుండా, రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినట్లు “ప్రయత్నంలో ఓడిపోకూడదు” అనే సంకల్పంతో రవి తిరిగి పోరాడాలని నిర్ణయించుకుంటాడు.

ఈ కష్టకాలంలో స్నేహితులు శివ, శ్రీనులతో పాటు పెద్దల అండతో రవి బెంగళూరుకు ప్రయాణమవుతాడు. ఆ ప్రయాణంలో అనుకోకుండా ప్రముఖ పారిశ్రామికవేత్త రాజశేఖర్ భార్యను ప్రమాదం నుండి కాపాడుతాడు. ఆ తర్వాత రాజశేఖర్ కన్స్ట్రక్షన్స్‌లోనే రవికి ఉద్యోగం లభిస్తుంది. రవి గతాన్ని, అతని నిజాయితీని తెలుసుకున్న రాజశేఖర్ ఒక ప్రైవేట్ డిటెక్టివ్ ద్వారా భవనం కూలిపోవడం వెనుక ఉన్న కుట్రను విచారణ చేయిస్తాడు. చివరికి జగదీశ్వరరావు కుట్రలు బయటపడి, రవి తనపై పడ్డ నిందల నుండి, చిక్కుల నుండి విజయవంతంగా బయటపడతాడు. ఓటమిని ఎదిరించి నిలిచిన రవి, చివరకు శృతిని వివాహం చేసుకుని తన జీవితాన్ని మళ్లీ గెలుపు బాటలో నిలబెట్టుకోవడంతో కథ సుఖాంతమవుతుంది..

~

చదవండి.. చదివించండి

‘గెలిచేదాకా పోరాడు..’

వచ్చే వారం నుంచే

Exit mobile version