15 నవంబర్ 2025 న విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ కు ‘జ్ఞానజ్యోతి’ పురస్కార ప్రదానోత్సవం సభ జరిగింది.
ఈ సభలో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ శ్రీ గోనుగుంట్ల కోటేశ్వరరావు డా. నాగసూరి వేణుగోపాల్ కు ‘జ్ఞానజ్యోతి’ పురస్కారం ప్రదానం చేశారు.
చిత్రంలో ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షులు డాక్టర్ సి భవానీదేవి, ఏ జయ ప్రకాష్, కోపూరి పుష్పాదేవి, ఠాగూర్ గ్రంథాలయ అధికారిణి కె. రమాదేవి, సంఘ ప్రధాన కార్యదర్శి చలపాక ప్రకాష్, నానా, ఎస్ఎం సుభాని, శర్మ సిహెచ్ తదితరులు ఉన్నారు.
– చలపాక ప్రకాష్,
ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం

