[శ్రీ గోలి మధు రచించిన నాలుగు మినీ కవితలను పాఠకులకు అందిస్తున్నాము.]
1. మాట
ప్రవహించే నది
ఘనీభవిస్తే
కదిలే కాలం ఆగినట్లా?
వెలుగు కిరణమైన
ఒక్క మాట
ఘనీభవించిన
‘మన’ సునదిని పరిగెత్తించదూ!
~
2. నమ్మకం
నమ్మకమే పునాది
గుడ్డిగా నమ్మకు
నమ్మకం గుడ్డిది
నమ్మకం అంటే
అంతః చక్షువు!
~
3. గమ్యం
తీరం చేరని
నావ వే
గమనం లేనంత వరకు
తీరం ఎరుగని
నావ వే
దూరం తెలియనంత వరకు
తీరం తాకలేని
నావ వే
నావికుడవు కానంత వరకూ
~
4. ముసుగు
ముసుగు తొడిగిన
మానవ
గమనంలో
నైతికత
ఓ నాటకం
చిత్తశుద్ధి
అదో బ్రాంతి
అంతరాత్మ
ఆనవాలు
కోల్పోయిన పదం!