Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గోలి మధు మినీ కవితలు-31

[శ్రీ గోలి మధు రచించిన నాలుగు మినీ కవితలను పాఠకులకు అందిస్తున్నాము.]

1. సంతకం

కొవ్వొత్తిలా
కరిగే కాలం వెలుగులో
కనిపించే చీకటి
తరిమే అక్షరాన్నై
అడుగులు వేసే ప్రతిసారీ
అలజడి ఒడిలో
అక్షరం చెంగు పట్టి
సమిధల గాథలు
వెదుకుతూ సాగిపోతూ
రాలిపోయే
చైతన్యపు సంతకాన్ని

~

2. ఊసరవెల్లులు

కుల మతాల గోడలకు
ఊసరవెల్లి
రంగులు వేస్తూనే ఉంటారు
దేశం కప్పుకు
బూజు అలాగే ఉంచి

~

3. లడ్డు లడ్డు

గడ్డు పరిస్థితులు
కానరాని గుడ్డి స్థితిలో
లడ్డు ప్రదక్షణ!

~

4. అరిష్టం

తక్కువగా తినమనే
తిండి ధరలు

ఎక్కువగా తాగమనే
మద్యం ధరలు!

 

Exit mobile version