[శ్రీ గోలి మధు రచించిన నాలుగు మినీ కవితలను పాఠకులకు అందిస్తున్నాము.]
1. దేముడు
విశ్వ ప్రేమికుడు
దేముడైతే..
కొందరికే
ఆలయప్రవేశం
కల్పించిన వాడు
మనిషి పుట్టించిన
దేముడు
~
2. కుతంత్రం
ధన ప్రాప్తికి
కుబేర యంత్రం
ఇది
కాయకష్టం చేయక
కనిపెట్టిన వాడి కుతంత్రం
~
3. ముప్పు
దేశం పాలలో
మతం ఉప్పు
సమతకు ముప్పు
ప్రజాస్వామ్యానికి నిప్పు!
~
4. స్వేచ్ఛ
స్వేచ్ఛాప్రియుడా
సాగిపో..
కులం కట్లు దాటి
మతం మత్తు వీడి
మ.. కారాల సంకెళ్లు వీడి
మమతల రెక్కలు చాచి
నిర్భంధాలను వీడి
సాగిపో స్వేచ్ఛాప్రియుడా
సాగిపో..
దేనికీ బందీ కానిదే కదా
స్వేచ్ఛంటే..!