[శ్రీ గోలి మధు రచించిన నాలుగు మినీ కవితలను పాఠకులకు అందిస్తున్నాము.]
1. మనసు
దుర్భేద్యమైన
సేఫ్టీ లాకర్!
~
2. చాపల్యం
గేలానికి చిక్కిన
ఓటరు చేప కంట తడి
కానరావడం లేదు
జిహ్వ చాపల్యానికి
~
3. లోక రీతి
రాయికి మన్ను
పువ్వుకు ముల్లు
పంటకు చీడ
మంచికి చెడు
చేదుకు మంచి
తీపికి చేటు
~
4. కర్మ ఫలం
ఒంటరిగా వచ్చాను
ఒంటరినై పోతాను
నడుమ ఆటంతా
నా కర్మ ఫలమే!