Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గూడేంది గువ్వేంది

[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘గూడేంది గువ్వేంది’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

పాత బడిన కొంపలో
రాత మారని రొంపిలో
ఈతి బాధల వేధింపులో
సొంతమనుకుని కాపురం
అంతు తెలియని పయనం
ఇంతయినా తీరదు మోహం
వింతగా వుంది జీవనం
బంధాలు బంధీలు
బతుకంతా ఇదే తంతు
కూసింతైనా సుఖమేదీ
ఆవగింజైనా ఆనందమేదీ
భ్రమల మధ్యన నడయాడుతూ
భ్రమరంగా తిరుగుడూ
అందులోనే గుడుగుడుగుంచెంగా
దింపుడు కళ్ళెం ఆశగానే
కాలాన్ని కాలరాస్తూ
సాగిపోతోంది ఉసురంతా
చిలకెగిరిపోగానే .మసక తీరగానే
గూడేంది గువ్వేంది
గొడవలేవీ గోల అసలేంది

Exit mobile version