Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

హమ్మయ్య!

[శ్రీ శ్రీధర్ చౌడారపు రచించిన ‘హమ్మయ్య!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


పరిసరాలు
నలుపవుతున్న పరిస్థితుల్లో
చీకటి గాఢతనందుకుని
చిమ్మచీకటి రూపుకట్టి తరిమేస్తుంటే
తప్పదనుకుని మరి.. కళ్ళు
పక్కకు తప్పుకున్నాయి
తమదైన చూపుల బాధ్యత నుంచి

వెలుతురు అజమాయిషీలోని
విధుల అలసటను ఓ పక్కగా విడిచేస్తూ
విడిచి దూరంగా విసిరేస్తూ
విశ్రాంతి తీసుకుంటున్నాయి హాయిగా

కనురెప్పల దుప్పట్లు కప్పేసుకుని
కమ్మని నిద్రలోకి జారుకుంటున్నాయి
కలల కౌగిట్లోకి అలా దూరిపోతున్నాయి

ఈ పూటకు తమ బాధ్యత,
హమ్మయ్య..!
ఇక పూర్తి అయిపోయిందనుకుంటూ

Exit mobile version