[జీ.వీ.యస్. ఆచార్యులు గారు రచించిన ‘హృదయంలో నిదురించే చెలి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
దేహం నాదే.. అందులోని
హృదయ గది మాత్రం తనదే..
ఆ గదిలో జాగానే దొరకదు
ఎప్పుడు చూసినా గది అంతా
తనూ నేను పంచుకున్న
అపురూప అనుభూతుల మయమే
దేహాన్నొదిలి జ్ఞాపకాలుగా మిగిలి
నా హృదయ గదిలో శాశ్వతంగా
ప్రశాంతంగా తను నిదురిస్తుంటే
ఒంటరినై
తడియారని కన్నులతో
తలుపులు లేని నా ఎద గదిలోకి
తొంగి తొంగి చూస్తూ నేను..
