Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

హిస్టారికల్ ఫిక్షన్ రచనాసక్తి కల రచయితలకు స్వాగతం! – ప్రకటన

తెలుగులో విభిన్న ప్రక్రియలో రచనలు విస్తృతంగా రావాలన్నది సంచిక ఆకాంక్ష. ఈ లక్ష్యం సాధించే దిశలో, ‘హిస్టారికల్ ఫిక్షన్ రచనాసక్తి కల రచయితల’ జట్టు తయారుచేయాలన్నది ఒక అడుగు.

హిస్టారికల్ ఫిక్షన్ రచన ఒక ప్రత్యేకమైన రచన ప్రక్రియ. ఇలాంటి రచనలు చేయాలంటే అవసరమైన మెళకువలు వివరించి, హిస్టారికల్ ఫిక్షన్ రచనలు చేయించి సంచికలో ప్రచురించటం ద్వారా ఇలాంటి రచయితలకు ప్రోత్సాహం లభిస్తుందన్న ఆలోచనతో సంచిక ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేస్తున్నది.

హిస్టారికల్ ఫిక్షన్ రచనలు చేయాలని ఆసక్తి ఉన్నవారంతా ఈ క్రింద ఇచ్చిన లింకు ద్వారా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు.

నవంబర్ 15వ తేదీనుండి, రచనల మెళకుల చర్చ ఆరంభమవుతుంది.

ఆసక్తి ఉన్నవారు తాము చేరటమేకాక, ఆసక్తి ఉన్న ఇతరులకు కూడా ఈ సమాచారం అందించి గ్రూపులో చేర్పించాలని అభ్యర్ధన!

వాట్సాప్ గ్రూపు లింకు:

https://chat.whatsapp.com/LbQbNYYPqWzECvinO1GNJd?s=sw&p=a&mlu=4&ilr=4

Exit mobile version