Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఇంతేగా మరి

[శ్రీ సాహితి రచించిన ‘ఇంతేగా మరి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

రోజూ
తెల్లవారే నాటికి
కాలం ఇరుకై
కథ మసకబారి

నడక మెడవాలినా
చూపు కుండపోతకు
మొలకెత్తే ఒక్కో కల

తలెత్తి పిలిచే
హృదయంలో ఉదయించే
ప్రతి కిరణం ఓ కవితే..

ఆస్వాదించే కొద్ది
గొప్ప గ్రంథమే
ఆచరించే కొలది
గొప్ప అనుభవమే..

Exit mobile version