Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక-సాహితీ ప్రచురణలు సమర్పిస్తున్న సరికొత్త కథాసంకలనం ప్రకటన..

రైలుకథలు

దేశభక్తికథలు

తెలుగుకథల్లో గాంధీమహాత్ముడు

క్రీడాకథ

కులం కథ

రామకథాసుధ

సంచిక-సాహితీ ప్రచురణలు సంయుక్తంగా రూపొందించే కథల సంకలనం ఈ దీపావళికి తెలుగు సాహిత్య ప్రపంచానికి, తెలుగు కథాప్రేమికులకి అందుతుంది.

ఇంతవరకూ, విభిన్నమూ, విశిష్టమూ, అద్వితీయమైన కథా సంకలనాలను రూపొందించిన సంచిక-సాహితీ ప్రచురణలు ఈ దీపావళికి ‘భారతసైన్యం  కథలు’, కథా సంకలనాన్ని రూపొందించాలని నిశ్చయించింది.

ఇంతవరకూ తెలుగు కథల్లో భారతీయ సైనికులు విలన్లు. దేశంపై సాయుధ పోరాటాన్ని జరిపేవారు వీరులు, అమరులు. మన సైనికుల అకృత్యాలు చూసి మేధావుల దేశభక్తి పాలు విరిగినట్టు విరిగిపోతుంది. ఇలాంటి కథలే ఉత్తమ కథలుగా, గొప్ప కథలుగా ప్రచారం జరిగింది. స్థిరపరచటం సంభవించింది.

అయితే, నిజం వేరు!!!

సైనికులు సరిహద్దువద్ద ప్రాణాలు పణంగా పెట్టి, రాత్రింబవళ్ళు కాపాడకపోతే, మేధావులు లేరు, స్వేచ్చ స్వతంత్రాలు లేవు. హక్కులు లేవు. రక్షణ లేదు.

దేశ రక్షణ కోసం, మనం ఇళ్ళల్లో హాయిగా, భద్రంగా వుండటం కోసం సర్వం త్యాగం చేసే సైనికుల కథల గొప్పతనం ప్రదర్శించే కాల్పనిక కథలకు ఆహ్వానం.

సైనిక కథలంటే, సైన్యంలోని అన్ని విభాగాలుగా అర్ధంచేసుకోవాలి. కథలు కొత్తగా రాసి పంపినా, గతంలో రాసినవయినా, గతంలో ప్రచురితమయినవైనా, మీకు తెలిసిన ఇతరుల రచనలనైనా పంపవచ్చు.  నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా సృజించిన కథలు కావచ్చు. కాల్పనిక కథలయినా ఫరవాలేదు. భారత  సైన్యం ఔన్నత్యం, త్యాగశీలత్వం, ఉత్తమత్వాలను ప్రదర్శించే కథలకు ప్రాధాన్యం!!!

సృజనాత్మక ప్రతిభకు, రచనా నైపుణ్యానికి తప్ప ఇతర ఏ ఆంశాలకూ ప్రాధాన్యం ఇవ్వకుండా రచనకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే అత్యుత్తమ స్థాయి కథల సంకలనంలో స్థానం సంపాదించుకునేందుకు ఉద్యుక్తులవండి..

ఉన్నత ప్రామాణికాల కథల సంకలనం తయారీలో మీ వంతు చేయూతను మీ రచన ద్వారా అందించండి.

కథను టైప్ చేసి పంపితే సంతోషం. చేతి రాతతో పంపేవారు కథను చివరి తేదీ వరకూ ఆగకుండా కాస్త ముందుగానే పంపటం వాంఛనీయం!

కథ నిడివి పరిమితి లేదు. అయితే కథ నవల స్థాయి చేరకపోతే మంచిది.

కొత్త కథలను సంచికలో ప్రచురిస్తాము. అయితే, సంకలనంలో ప్రచురణకి  ఎంపిక మాత్రం సంపాదకులు నిర్ణయించిన ప్రామాణికాల పరిథిలో ఒదిగితే మాత్రమే!!!!!

కథలు పంపవలసిన చివరి తేదీ– 30/09/2024. 

మెయిల్ ద్వారా కథలు పంపాల్సిన చిరునామా—– sanchikastorycompilation@gmail.com

వాట్సప్ ద్వారా అయితే—–9849617392

by post ( పోస్ట్ ద్వారా అయితే) 

(గమనికః పోస్ట్ ద్వారా పంపేవారు విధిగా కథ కాపీ తమ దగ్గర వుంచుకోవాలి). 

plot no 32, h.no 8-48

raghuram nagar colony. aditya hospital lane

dammaiguda, hyderabad-83

Exit mobile version