Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఇట్లు మీ అభిమాని

[శ్రీ చందలూరి నారాయణరావు రచించిన ‘ఇట్లు మీ అభిమాని’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

నీ తెలియని గొంతు
బాగా తెలిసినప్పటి నుండి

ఏదో లోపల సంతోషం
బయటకు రాలేని బాధ.

అంతలోనే నీ మాటలు
భుజంపై చేతులు వేసి

ఏదో అడిగినట్లు
నేను ఏదో చెప్పినట్లు ఊహ.

చుట్టూ జనం ఉన్నా
నీలా ఒక్కరూ లేరనే ఏకాంతంలో

నీవు పక్కనే ఉంటావు
ఇట్లు మీ అభిమానిలా..

Exit mobile version