Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జయహో..! జయహో..! కనకదుర్గమ్మా..!

[2026 అక్టోబర్ 20 న విజయదశమి సందర్భంగా శ్రీ పోలయ్య కూకట్లపల్లి రచించిన ‘జయహో..! జయహో..! కనకదుర్గమ్మా..!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

ఓ మిత్రమా..! నా ప్రియ నేస్తమా..!
అదిగో అమ్మ ఆదిపరాశక్తి…
ఆ మంగళదాయిని..
ఆ మహిషాసురమర్దని..
ఆ జగజ్జనని..
ఆ బెజవాడ కనకదుర్గమ్మ..!

కరుణాకటాక్ష వీక్షణాలు,
వేలవేల వరాలు,
దివ్యమైన శతకోటి దీవెనలు
మీపై సదా ప్రసరించుగాక..!

మీపైనా, మీ కుటుంబంపైనా
ఆ తల్లి అనుగ్రహం
కుంభవృష్టిలా కురియుగాక..!

మీ కలం నుంచి
మరిన్ని మానవతా
మణిదీపాలు వెలువడుగాక..!

మీ కవిత్వం
చదివిన ప్రతి హృదయంలో
చిరు ఆశలు చిగురించుగాక..!
చిరునవ్వుల దీపాలు వెలుగొందుగాక..!
చింతల చీకట్లు తొలగిపోవుగాక..!
జీవితంలో ప్రశాంతతా నది
నిరంతరం ప్రవహించుగాక..!

మీ పాట విన్న ప్రతి మనసులో
ధైర్యం వెల్లివిరియుగాక..!
విజయ పథంలో
ముందుకు సాగేందుకు
మీ అక్షరాలు దారిదీపాలౌనుగాక..!

జయహో..! జయహో..!
ఓ కనకదుర్గమ్మా..! జయహో..!

వందనమమ్మా..! తల్లీ మీకు వందనం..!
శతమానం భవతి అంటూ దీవించే
మీ అభయామృత హస్తాలకు వందనం..!

ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు
పరుగు పరుగున తరలివచ్చే
మీ పాదపద్మాలకు వందనాలమ్మా..!

వందనాలు..! అభివందనాలు..!
శతకోటి పాదాభివందనాలు..
అక్షరలక్షల కుసుమాంజలులు..!

ఆ జగజ్జనని కనకదుర్గమ్మ
మీకు సకల శుభాలు ప్రసాదించుగాక..!

🌺 విజయదశమి శుభాకాంక్షలతో.. 🌺

Exit mobile version