[శ్రీమతి జయంతి వాసరచెట్ల రచించిన ‘జీవితాలను శాసిస్తుంది’ అనే కవితని అందిస్తున్నాము.]
అది ప్రేమను ఆశిస్తుంది
అభిమానాన్ని కూడగట్టుకుంటుంది!
గవ్వ తేడా వచ్చినా సొంత వాళ్ళే..
పరాయీకరణ చెందుతారు!
మతాలు మూఢనమ్మకాలకన్నా అతీతమైనది!
బురదలో కనిపించినా అసహ్యం కలుగదు!!!
గౌరవిస్తే నడిచొస్తుంది
నిర్లక్ష్యం చేస్తే తిరిగెళ్ళిపోతుంది!
ప్రపంచ దేశాలన్నీ మనీ.. మినీ అని
సంబోధించినా..
నా దేశం లక్ష్మీదేవిగా కొలుస్తూ కీర్తిస్తుంది!
యుగాలు మారినా టెక్నాలజీ పెరిగినా
మానవమేథస్సుతో నూతన ఆవిష్కరణలు జరిగినా..
దాని విలువ ఉన్నతంగానే ఉంటుంది!
దేశం ఏదైనా జనాభా ఎంత పెరిగినా..
వారి మనస్సుల్లో ఆశలు
రేకెత్తించి పరుగులు పెట్టిస్తుంది!
డబ్బు ఒక దాహం లాంటిది
ఇంకా.. ఇంకా కావాలనిపిస్తుంది
మానవ జీవితాలను శాసించి
తన గుప్పిట్లో బంధిస్తుంది!
