[శ్రీ చందలూరి నారాయణరావు రచించిన ‘జీవితం తాలుకా..’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
కింద కూర్చొని
మట్టిలో తడుస్తూ
కను గుంటల్లో తేమను ఊదుకుంటూ
చెమట సెగల పొగల మధ్య
అక్షరాలను కటిక చీకట్లో
నాలుకపై ఆర్చుతూ
మనసారా బాధను
ముద్దాడుతూ
మెలికలు తిరుగుతూ
మడతపడుతూ
మలుపులను పిండుతూ
నా ఒక్కడిలో
నేను ఒక్కడినే
నా తొలి రోజులని
నా లోతు నిజాలని
కలాన్ని ఏతంగా తోడుతుంటే
పారేది కవిత్వం కాదు
మునిగేది అక్షరాల్లో కాదు
ఓ జీవితం తాలుకా
మట్టి కథలో మనసు వ్యథలో
