Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జీవితం

[శ్రీ భళ్ళముడి వెంకట నాగేశ్వర రావు రచించిన ‘జీవితం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

రేపటి గురించి ఆలోచిస్తూ
ఈరోజు జీవించడం మరవద్దు
ఒక కప్పు కాఫీ
పాత పాటలు
పడక కుర్చీ
ఇవి చాలు
జీవితం ఆస్వాదించడానికి
సంతోషం ఎక్కడో లేదు
ప్రతీ క్షణం జీవించడంలో ఉంది

Exit mobile version