[శిరీష పద్మ యర్రంశెట్టి గారు రచించిన ‘కాలమే తుది తీర్పు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
నిజం నెమ్మదిగా నడుస్తుంది,
అబద్ధం ఆతురతలో తానే కూలుతుంది.
ముసుగులు వెన్నెలలో మెరిసినా,
వెలుగులో వాస్తవం దాగదు.
శబ్దం చేసే మాటలు క్షణికం,
నిశ్శబ్దంగా నిలిచే విలువలే స్థిరం.
ఈ రోజు వక్రీకరించిన సత్యం
రేపు కాలమే సరిచేస్తుంది.
ఓర్పు దీపంలా వెలిగితే,
అన్యాయం నీడలా కరుగుతుంది.
న్యాయం ఆలస్యమవుతుంది గాని
అన్యాయం నిలబడదు..
ఎందుకంటే
కాలమే తుది తీర్పు.
