Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కావ్య కన్యక

[వాణి వేమవరపు గారు రచించిన ‘కావ్య కన్యక’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

జాబిలి నిను చూసి నివ్వరపోయే,
భువిన తిరుగాడునది తన బింబమని విస్మయ మందే.
అద్భుత మోందె నా కోయిలలు నీ గానము ఆలకించి,
తమ గొంతుక మించి స్వరము గాంచి ఉలికిపడే.
నీ కనుదోయికి ఆ కమలము అబ్బురపడే,
విరిసిన ఆ కుసుమ కాంతిని నీ యందు గాంచె.
తన నేస్తమని భ్రమసి ఆ నెమలి నాట్యమాడే,
నీ నడక యందు కాలి అందియల సవ్వడి గాంచి.
నీ దరహాసమున ముత్యపు జల్లుల గాంచి,
తొలకరి జల్లని తలచి పుడమి పులకరించే.

మది నందు గాంచిన ఈ మగువని,
కనుల ముందు తిరుగాడు కావ్య కన్యకని,
ఇల యందు గాంచుటెపుడు,
నా ప్రేమను తెలుపుట ఎపుడు.

Exit mobile version