Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ప్రముఖ రచయిత డా. అంబల్ల జనార్దన్ గారికి ‘కబీర్ కోహినూర్ సమ్మాన్’ పురస్కారం – వార్త

ముంబయికి చెందిన ప్రముఖ తెలుగు రచయిత డా. అంబల్ల జనార్దన్ గారిని జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన ‘కబీర్ కోహినూర్ సమ్మాన్’ అవార్డుకు ఎంపికచేశారు. వివిధ రాష్ట్రాల్లో సాహిత్య, సామాజిక సేవ చేస్తున్న 21 మందిలో, ఈ పురస్కారం తెలుగు సాహిత్యంలో కథానికలకు ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా లభించింది.

రాజస్థాన్‌కు చెందిన అఖిల్ భారతీయ కబీర్ మఠం సద్గురు కబీర్ ఆశ్రమ్ సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో జూన్ 28, 29, 2026 తేదీలలో నిర్వహించనున్న 629వ కబీర్ జయంతి మహోత్సవంలో భాగంగా ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఇది ఆయన సాహిత్య కృషికి లభించిన గొప్ప గౌరవం.

తెలుగేతర రాష్ట్రంలో ఉన్నా, గత మూడు దశాబ్దాలుగా తెలుగు భాషకు వారు చేస్తున్న సేవలకు గుర్తింపుగా ‘కబీర్ కోహినూర్ సమ్మాన్’ పురస్కారం అందిస్తున్నారు. అంతేకాకుండా, డా. అంబల్ల జనార్దన్ గారు ఆ సందర్భంగా, ఈ డిజిటల్ యుగంలో కూడా కబీర్ దోహాలు విద్యార్థులకు, యువతకు ఎలా వర్తిస్తాయో, ఎలా ఉపయుక్తమో అనే విషయంపై పత్ర సమర్పణ చేయ నున్నారు. ఇది వారి బహుముఖ ప్రజ్ఞకు అద్దం పడుతుంది.

ఈ వార్త వెలువడిన వెంటనే, పలువురు విద్యావేత్తలు, సాహితీవేత్తలు, ప్రముఖులు, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పురస్కారం వారిని మరింత ప్రోత్సహిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఐతే ఈ పురస్కారం, సమాజం పట్ల తన బాధ్యతను మరింత పెంచిందని డా. అంబల్ల జనార్దన్ గారు అభిప్రాయ పడ్డారు.

Exit mobile version