Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కల

[శ్రీ సాహితి రచించిన ‘కల’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

ఏ కలైనా
పుట్టింటి ప్రేమను
మరువదు..

కుదుపులో
కలతలో
కలవరింతలో సహితం
కౌగిలి సడలదు.

నడిరాత్రి
నిద్ర ఒడిలో మెలకువతో
మౌనంగా
గమనిస్తూనే ఉంటుంది.

కన్న ప్రేగు తీపి
పెరిగిన ప్రేమ వాసన
ఎదిగిన బంధం విలువను

నెమరు వేసుకుంటూ
ప్రతి క్షణం మనసు
కలని మోస్తూనే ఉంటుంది.

Exit mobile version