[శ్రీ చందలూరి నారాయణరావు రచించిన ‘కమిలిన ముఖంతో పగలు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
దేనికో
దూరంగా విసరబడినప్పుడో?
ఎందుకో
దగ్గరగా అతుక్కున్నప్పుడో?
దానికి
పక్కున నవ్విన కాలాన్ని చూసి
మనసున కసి అంకురించి
అది నిద్రకంటుకుని
రాత్రి కొడికట్టి
బద్దకంగా నడుస్తుంటే
మెలుకువ తలుపు తీసుకుని
వేసే ప్రశ్నలకు
కమిలిన ముఖంతో పగలు
జవాబు చెప్పలేక
తలవంచుకొని చేతులు కట్టుకుంటే
ఆరడుగుల మనిషి
అర అడుగు కూడా వేయలేక
చిట్లిన ఆలోచన చెమిడిన బాధలో
శబ్దాన్ని చంపి నిశ్శబ్దాన్ని ధరించి
ఓ వైపు
కాలాన్ని తప్పించుకుని తిరుగుతూ
మరో వైపు
కాలాన్ని గురి చూస్తేనే ఉంటాడు.
నేటి శత్రువుగా
మారిన నిజాన్ని
రేపు ఆయుధంగా మార్చడానికి
