[శ్రీ సంఘమిత్ర రచించిన ‘కనబడని చెయ్యేదో..’ అనే పద్య కవితని అందిస్తున్నాము. సంచిక నిర్వహించిన లవ్ జిహాద్ కవితలో పోటీలో బహుమతి పొందిన కవిత.]
~
తే.
పొగడు నందమ్ము బహుగొప్ప పదము పేర్చి
కలను నీవంటి సుకుమారి కంటి ననుచు
కరిగి సిగ్గిల సరియని కాంచు నపుడు
వడిగ నీతోడ నడుగిడు వినుము బాల
తే.
బడియు గుడియున్ను రహదారి బట్టు నెపుడు
కడకు తారతమ్యమ్ములు కనడు నేడు
వయసు కేమియు వ్యత్యాస మసలు లేక
వనిత కనబడ్డ గురిపెట్టు వినుము బాల
తే.
అడుగు వేయక తొలుతన తలపు సేయ
కాన నగును నీ పరివార కాంతు లెల్ల
పరువు మరియాద గలదిమీ బతుకు గాదె
నిలువ నీడంటు కనవిక వినుము బాల
తే.
గడప దాటిన మిగిలేవి కథలు గావె
ఇంటి వారల యిడుములు మింటి కెగయు
అమ్మ నాన్నలు గుండెల దరగ నేడ్వ
వీధి వారంత నవ్వరే వినుము బాల
తే.
దరిని చేరగ హితుడని నమ్మి నీవు
మంచి చెడ్డలు తనతోడ మనసు విప్ప
అప్రమత్తత అనునది అసలు లేక
విచ్చు వాడిమోముననవ్వు వినుము బాల
తే.
అంద మణకువ లున్నట్టి బేల వీవు
అంద నెత్తుకు జేర్పించ నాశ జూపి
బతుకు లన్నియు నొకటని బొంకు లాడి
వశము చేకొను నీజుట్టు వినుము బాల
తే.
ఏండ్ల తరబడి కొనసాగె నట్టి హేళ
అడ్డు పడగరా రెవ్వరు ఆదు కొనగ
లౌకి కులమను బింకము లెన్నొ పలుక
వింత నడతలు వారివి వినుము బాల
తే.
చరిత తెలిపిన పాఠాలు మరిచి నావ
మధ్య యుగమున మొదలైన మెరుపుదాడి
గాయ పరిచిన దేహాల గాధ మనది
వినియు నోరెత్త కుందురు వినుము బాల
తే.
వంద లేండ్లుగ సాగెనీ తొండి యాట
తరిగె సంపద సిరులన్ని తరలి పోయె
మాన ధనములు దోచిరే మగువ లేడ్వ
విచ్చుకత్తులు చూపుతు వినుము బాల
తే.
తెలియు ననుకుంటి తైమూరు ఆత్మకథను
రుధిర చరితన్న విల్లుడ్యు రాంటు గారు
అలెసు డెనియలు నరమేధ మనియె గాద
వినరవి మన మేధావులు వినుము బాల
తే.
తీపి నగవుల బురిడీలు నమ్మ బలుక
కాసు కనకమ్ము కారుషి కారు తిరుగ
ఆశ నడుగులు ముందుకు సాగి నపుడు
వివిధ విధముల తలపోయు వినుము బాల
తే.
ఉచ్చు నపడిన యంతట ఊరు దాటి
పశువు నమ్మిన చందాన నమ్మజూపు
అంత చాకిరి సేయగ నలసి పోగ
విటుల తార్పగ యత్నించు వినుము బాల
తే.
వినక నెదిరించి నిలిచిన విరుచు కాళ్ళు
మూల బడవేయు బందీగ మూతి కట్టి
లోని నిజరూపు గుర్తించ లేక నీవు
విస్మయముచెంద ఫలమేమి వినుము బాల
తే.
నీదు విశ్వాస ములనెల్ల గేలి చేసి
వారి బతుకొక గొప్పని వాదు చేయు
లౌకి కత్వపు ఓరిమి లేమి బరచి
మిడిసి దుర్భాష లాడునే వినుము బాల
తే.
అయిన అంతగ మోజున పడెద రేమి
తాయి లాలకు బతుకులు మార్చ నగునె
నీది సనపొందు లాభంబు గూడ పొంది
నిలిచి యోచన గావించు వినుము బాల
తే.
నీతి మరచియధర్మమ్ము జేరి తివిరి
తత్వ మిచ్చిన హక్కుల్ని కాల రాయ
నిమ్మ కుండిన మేధావు లిమ్ముగుండ
వింత చూడగ నగవొచ్చు వినుము బాల
ఆ.
నేడు కూడ చింత నదియేగ కోవెల
లన్న మంట కాంత లనిన భేద
నాటి జేనొ సైడు పత్రము లను చూడ
విరివి గాను తెలియు వినుము బాల
ఆ.
లౌకి కమ్మొ పార లౌకిక చింతయో
లేన చోనలౌకి కెమ్మొ నెంచ
నలవి కాని పనిగ నంతతో చెంగదా
విఫల చర్య గాదె వినుము బాల
ఆ.
ఇచట నెత్తు కొందు మైనారి టీలను
అచట డమో క్లస్సు కత్తు లుండు
తలల మీద భద్ర తేదిక వారికి
వివక్ష నీతి యనరె వినుముబాల
ఆ.
కొలువ భరత జాతి కొకధర్మ మొకనీతి
ఎప్పుడొచ్చు మనకు ఎంచి చూడ
అకట దొడ్డి దారు లన్నియు వెదుకగ
ఇరుగు పొరుగు తలచె వినుము బాల
ఆ.
మతమ నంగ బతుకు మనువైన అన్యుల
మతము కించ పరచ తగదె నీకు
ఇతర మంది రముల గొట్టుట ఏలకో
వికట జనుల పనులవి వినుము బాల
ఆ.
ప్రేమ రణము సేయ జీహాదు లగుటకు
అల్ల నుడువ ధర్మ గతికి తరల
అనఘు లెల్ల కదల ఆవేశములతోడ
నిలుప దుష్ట మూక వినుము బాల
సింహగిరి పి.ఎ. (కలం పేర్లు: సంఘమిత్ర, సింహగిరి) విశాఖపట్నానికి చెందిన ప్రముఖ రచయిత, విశాఖ రచయితల సంఘం సంయుక్త కార్యదర్శి.
నేటి సమాజాన్ని ప్రతిబింబిస్తూ, పాఠకులలో మంచి ఆలోచనలను రేకెత్తించేలా, స్ఫూర్తిదాయకంగా నిలిచేలా రచనలు చేయాలనేది వీరి ప్రధాన అభిలాష.
ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి కామర్స్‌లో డిగ్రీ, ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉత్పాదక మండలి నుండి కంప్యూటర్ అప్లికేషన్స్‌లో పిజి డిప్లొమా పట్టా పొందారు.
ప్రస్తుతం శ్రీ అడపా రామకృష్ణ గారి సారథ్యంలో ప్రతిష్ఠాత్మకమైన విశాఖ రచయితల సంఘం సంయుక్త కార్యదర్శిగా క్రియాశీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
‘సంఘమిత్ర’, ‘సింహగిరి’ అనే కలం పేర్లతో వివిధ ప్రముఖ దిన, వార, మాస పత్రికలలో మరియు సాహిత్య సంకలనాలలో వీరి కథలు, కవితలు, వ్యాసాలు విస్తృతంగా ప్రసారమయ్యాయి. వీరి ముద్రిత గ్రంథాలు: అంతర్దర్శనం (కథాసంపుటి), మునగపూల జల్లు (కథాసంపుటి), మజిలీ (నవల).
వీరు తెలుగు సాహిత్య దిగ్గజాల రచనల పట్ల అమితమైన ఆసక్తిని కలిగి ఉన్నారు. ముఖ్యంగా కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి భాషా శైలి, బుచ్చిబాబు గారి ఏకాంత సాహితీ సేవ, మరియు దేవులపల్లి కృష్ణశాస్త్రి, తిలక్ గార్ల భావుకత వీరిని ఎంతగానో ప్రభావితం చేశాయి.
