Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కనులకు బహుమానం

[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘కనులకు బహుమానం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

అందానికి కొలమానం
నా కనులకు బహుమానం
నా చూపులకు నీ సోయగం
దొరకడం ఓ వరం
నా కంటి పాపలలో
నీ ప్రతిబింబం నిలవడం
నేను చేసుకున్న పుణ్యం
ఇంతటి సొగసును అనువదించిన
నా రెండు కనులకూ నేను
ఎప్పుడూ వుంటాను రుణం
ఈ సౌందర్యాన్ని చూసిన
నా జన్మ ధన్యం
కళ్ళున్న మనసును
మనసున్న కళ్ళను
నాకు ఇచ్చిన ఆ దేవుడికి వందనం
ప్రకృతిని కళ్ళెదుట వుంచినందుకు
మరో మారు అభివందనం

Exit mobile version