Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కర్తవ్యం

[శ్రీమతి నంద్యాల విజయ లక్ష్మి గారు రచించిన ‘కర్తవ్యం’ అనే కవితని అందిస్తున్నాము.]

మృగాలను ఊరిమీద వదిలేస్తే
వేటాడుతాయి ఆకలి తీర్చుకోడానికి
ఇది సహజ లక్షణం
మనిషి మృగంలా మారితే,
ఉచ్చనీచాలు ఎరగడు
విలువలు విస్మరిస్తాడు.
ఇది దానవ లక్షణం.
మానవత్వాన్ని వెలికి తీసి
దానవత్వాన్నిరూపుమాపి,
నీతి అనే ఖడ్గంతో, అవినీతిని నరుకుదాం.
ధర్మాన్ని కుంటువడనీకుండా ,
ధైర్యాన్ని ఊతకర్రగా మలచుకుని,
అధర్మాన్ని తరిమికొడదాం.
చేయిచేయి కలుపుకుని,
ఐకమత్యమే బలమని
నిరూపిద్దాం.
ప్రగతిమార్గంలో పయనిద్దాం.
సేవాభావంతో సహకారం
అంకితభావంతో
శ్రమదానం
తోటివ్యక్తులను గౌరవించడం లక్ష్యాలుగా,
దేశపురోగతికి బాటలు వేద్దాం.
తొందరపాటుపనులు
అరికడదాం.
జగమంత కుటుంబం నాది
జనులంతా నా వారలే,
అను భావనతో,
ఙీవనయానం సాగిద్దాం.
జీవితాన్ని సార్థక్యం చేసుకొందాం.

Exit mobile version