Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

యానాంలో ‘కవి సంధ్య’ పొయిట్రీ వర్క్‌షాప్ – ప్రకటన

తెలుగు శాఖ, డా.ఎస్.ఆర్.కె. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల, యానాం, కవిసంధ్య, సాహిత్య సాంస్కృతిక సంస్థ, సంయుక్త నిర్వహణలో 2026 జూన్ 13, 14, తేదీలలో యానాంలో కవిత్వ శిక్షణా శిబిరం జరుగుతుంది.

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల నుండి సుమారు 30 మంది వర్ధమాన కవులు హాజరయ్యే ఈ వర్క్‌షాప్‌లో ఆర్. సీతారాం, శిఖామణి, చల్లపల్లి స్వరూపరాణి, బొల్లోజు బాబా, దాట్ల దేవదానం రాజు, మధునాపంతుల, నామాడి శ్రీధర్, అద్దేపల్లి ప్రభు, కొబ్బరాకు సుధాకర్, సుంకర గోపాల్, కె. నాగ సత్యనారాయణ, అవధానుల మణిబాబు, పి శివనాగ రాజు వివిధ కవిత్వ అంశాలపై ప్రసంగిస్తారు.

ఈ సందర్బంగా ‘కవి సంధ్య’-60వ ప్రత్యేక సంచికను ముఖ్య అతిథి, పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు ఆవిష్కరిస్తారు.

సి హెచ్.రాం, అరిగెల రాజు సమన్వయ కర్తలు.

– డా. వరుగు భాస్కర్ రెడ్డి, ప్రిన్సిపాల్ & కన్వీనర్, పొయిట్రీ వర్క్‌షాప్

Exit mobile version