Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కవిసంధ్య సాహితీ పురస్కారాలు 2026 – ప్రకటన

‘కవిసంధ్య’ ప్రతీ ఏటా ఇచ్చే ‘శిఖామణి జీవన సాఫల్య సాహితీ పురస్కారం-2026’కు ప్రముఖ పద్య కవి, కావ్య వ్యాఖ్యాత, కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద అవార్డు గ్రహీత ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, కవిత్వంలో యువకవులకు యిచ్చే ‘శిఖామణి యువపురస్కారం-2026’కు కవయిత్రి దొండపాటి నాగ జ్యోతి ఎంపిక అయ్యారు.

వీరితో పాటు మరో అయిదుగురు కవిసంధ్య ప్రతిభా పురస్కారాలు అందుకుంటారు. ఈ మేరకు పురస్కారాల కమిటీ దాట్ల దేవదానం రాజు (అధ్యక్షులు) సభ్యులు కె.శివారెడ్డి, కొలకలూరి ఇనాక్, శిఖామణి, అవధానుల మణిబాబు ఒక ప్రకటనలో తెలియ చేశారు.

పురస్కారాల ప్రదానం అక్టోబర్ చివరి వారంలో యానాంలో జరిగే శిఖామణి సప్తతి సాహితీ సదస్సులో ఉంటుంది.

– దాట్ల దేవదానంరాజు

కవిసంధ్య, యానాం.

Exit mobile version