Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కయ్యూరు బాలసుబ్రమణ్యం నానీలు 12

[శ్రీ కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం రచించిన ‘కయ్యూరు బాలసుబ్రమణ్యం నానీలు 12’ అనే కవితలను పాఠకులకు అందిస్తున్నాము.]

ఆకాశంలో
సీతాకోక చిలుకల గుంపు
ఇంధ్ర ధనుస్సు
చిన్నబోయింది

మనసు
గాయమైన ప్రతిసారి
నా కవిత్వం
లేపనమవుతుంది

చెట్లకూ
వ్యథలుంటాయి
ఇవ్వడమే కాని
తీసుకోవడం చాతగాదు

తొలకరి జల్లులు
వినువీధులలో
ఆకాశం
స్నానమాడిందేమో

Exit mobile version