చెట్లకు
సంభాషణలుంటాయి
కాకపోతే
శబ్దాలే ఎక్కువ
రాతిని
నిర్జీవంగా చూడకు
మనసుతో చూస్తే
అది సజీవ శిల్పం
సేదతీరుస్తుంది
అలసినప్పుడల్లా
బాల్కనిలో
పిల్లతెమ్మెర
మట్టి రేణువులతో
బాల్యమంతా
సుగంధ పరిమళాలే
తనువంతా
కలవలేని
భగ్న హృదయాలు
ఎడబాటుతో
రైలు పట్టాలు