Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కొంగ్రొత్త వెలుగు

[డా. మైలవరపు లలితకుమారి రచించిన ‘కొంగ్రొత్త వెలుగు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

రేపటి సూర్యోదయ కిరణాల
కొత్త వెలుగులతో
కొత్త ఆలోచనలతో
కొత్తగా లేద్దామనుకున్నా
కొత్త డైరీ రాద్దామనుకున్నా
కాని నేను నిన్నటి వాడినేగదా
గతం తాలూకు నిన్నటి
ఆలోచనలు వదలటంలేదు
కాలం గడిచి పోతున్నది
పాత క్యాలండర్ తీసి
కొత్తది తగిలించా
రేపు ఉదయాన్ని
కొత్తగా ప్రారంభించాలని
గతం జ్ఞాపకాల దుప్పటిని
నిండా ముసుగుకప్పుకుని
నిద్ర పోగూడదనుకుంటూనే
రేపటి గురించిన ఆశల
కలలు పోగేసుకుంటూ
నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాను
ఇంతలో ఎవరో వచ్చారు
తలుపులు బాదుతున్నారు
లేవకూడదనుకున్నా
కానీ లేవక తప్పలేదు
తీరా తలుపుతీద్దును కదా
ఉషోదయ కిరణాల
కొంగ్రొత్త వెలుగులతో
నూతనవత్సర అభినందనములతో
అందమైన భవిష్యత్తు
నాకళ్ళముందు కనిపిస్తుండగా
ఆనందంలో మునిగిపోయా
‘హ్యాపీ న్యూ ఇయర్’
అన్న మాటలు చెవులలో
మారుమ్రోగి కొత్తదనం
సాక్షాత్కరించింది.

Exit mobile version