[శ్రీ కనపర్తి రాజశేఖరమ్ రచించిన ‘కొన్ని జ్ఞాపకాలు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
కొన్ని జ్ఞాపకాలు
చిత్రపటాలై
గోడ మీద
వ్రేలాడుతున్నవి
అక్షరాలై
కాగితం మీద
ఒదుగుతున్నవి
రేణువులై
నేల మీద
రాలుతున్నవి
అణువులై
చితి మీద
కాలుతున్నవి
కంటకాలై
చిత్తం మీద
గ్రుచ్చుతున్నవి
విరాగాలై
క్షణాల మీద
మారుతున్నవి
