Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కొరియానం – A Journey Through Korean Cinema-30

తిరక్కథ – 1

Chapter 27 Prologue

Screen Writing అని సెర్చ్ సైట్లలో కొడితే వందల పుస్తకాలొస్తాయి. ప్రతిదీ అద్భుతమే, అమోఘమే, అత్యద్భుతంగా స్ట్రక్చర్ చెయ్యబడ్డదే! ‘మస్ట్ రీడ్’ అన్న మాట బహు చక్కగా అబ్యూజ్ చెయ్యబడటం ఈ విషయంలోనూ గమనించ వచ్చు. పైగా సినిమానే మాయా ప్రపంచం కదా.

అన్ని పుస్తకాలోంచీ దేన్ని ఎన్నుకోవాలి? అసలు స్క్రీన్ రైటింగ్ అన్న దాని కోసం పుస్తకాలు చదవాలా? పుస్తకాలు చదివితే కానీ వ్రాయలేమా? చదివినవి మనకు ఎంత వరకు ఉపయోగ పడుతాయి? అసలు ఎలాంటి పుస్తకాలు ఎన్నుకోవాలి? అవే సరియైనవని నమ్మకం ఏమిటి?

చాలా ప్రశ్నలే. జవాబులు precise గా ఇవీ. అని ఎప్పుడూ రావు. ఎంత మంది జనాలున్నారో అన్ని రకాల సమాధానాలు వస్తాయి. ఎవరి పాండిత్య ప్రదర్శన వారు చేసుకోబూనతారు.

కోవాలి కదా. ఇదసలే మార్కెటింగ్ యుగం. వాల్మీకి మహర్షి దిగి వచ్చినా, నీ రామాయణానికి ఫస్ట్ లుక్కు, పుస్తకం టీజరు, కవర్ పేజ్ ఎనౌన్స్మెంట్, పుస్తకం డిజైన్ లీక్స్, అన్నీ అయ్యాక పీడీఎప్ పంపిస్తారా? ఇది నా ఇ-మెయిల్.

తర్వాతో సభ. ఆ పుస్తకంలో నాలుగు వాక్యాలు బట్టీకొట్టుకొచ్చిన అతిథి గారో ఉపన్యాసం దంచాలి. ఇక సబ్జక్టుకు సంబంధం లేని మేధావి గారి ఉపన్యాసం.

సర్సర్లే! సోదాపి విషయానికి రా! అని నన్ను (yours truly) అనగలరు కానీ ఆ మేధావీయులను అనలేరు. గట్టిగా అంటే ఇంకో ఆవిష్కరణ సభ లేకుండా బహిష్కరణ. ఇంత తతంగం.

కనుక… based on someone with some practical knowledge, సరైన పెద్దలను (ఉదా॥ సినిమా స్క్రిప్టు కోసం సికందర్ గారి లాంటి వాళ్ళు) పట్టుకోగలిగితే కాస్త సరైన దారి దొరుకుతుంది. ఈ లోగా నా ప్రాక్టికల్ సలహా కూడా చూద్దాం.

పై ప్రశ్నలకు సమాధానాల కోసం ప్రయత్నిద్దాము.

అసలు ఏదైనా పని మొదలు పెట్టే ముందు, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవటమనేది మంచి పద్ధతి. దానికి సంబంధించిన పుస్తకాలేమన్నా ఉన్నాయేమో చూడటం, పనికొచ్చే సమాచారం సేకరించటం మొదలైనవన్నమాట. ఇంతకు మునుపు ఏమి జరిగింది, ప్రస్తుతం ఏమి జరుగుతున్నది, మొదలైనవి తెలిస్తే, మన స్థాయి ఎక్కడ ఉన్నది? అలాగే, మనమే విధంగా మొదలు పెట్టవచ్చన్నదీ అంచనా వేసుకోవచ్చు. అన్నిటికన్నా ప్రధానమైన విషయం ముందు బేసిక్స్ బలంగా ఏర్పరచుకోవాలి.

మరి ఎలాంటి పుస్తకాలు చదవాలి? చాలా చిన్న సమాధానం. మన అవసరానికి తగినటువంటివి. నెట్లోనూ, మార్కెట్లోనూ ఎన్నో పుస్తకాలుండగా ఏది మనకు తగినదని తెలుసుకోగలం? ఎవరికి వారే నేర్చుకోవాలి/వెతుక్కోవాలి అన్నమాటైతే కనుక కనిపించిన పుస్తకాన్నల్లా చదవటమే బెస్టాప్షన్ 😉 టైమ్ కన్జ్యూమింగ్, మరియూ, ఉపయోగ శూన్యం ప్రాక్టికల్‌గా చూస్తే. అందుకే, ఏ విషయాన్నైనా గతంలో జరిగిన వాటిని పరిశీలించటం అన్నది ముఖ్యం. ఇక్కడైతే చదివిన వాళ్ళెవరన్నా ఇచ్చే సలహాలూ, సంప్రదింపులూ.

ఉపోద్ఘాతమైంది కనుక అసలు విషయానికొద్దాము. టాపికిక్కడ స్క్రీన్ రైటింగ్ కనుక, ఆ పేరుతో ఉన్న పుస్తకాలని ముందు చూడాలి. వాటిలో నేను చదివిన ఆరింటిలోనూ ఉపయోగ కరమైనది… సిడ్ ఫీల్డ్ ట్రైలజీ. అంటే మొత్తం సిడ్ ఫీల్డ్ కాక మరో ఐదు పుస్తకాలు చదివానని.

సిడ్ ఫీల్డే ఎందుకు గొప్పది అంటే…

1) There is logical arrangement of the subject.

2) Vast experience, and exploratory nature.

3) His invaluable experience with Jean Renoir

4) Explained every minute detail with suitable examples.

5) Perfect updation

6) Authentic, and readable presentation of subject matter.

సూటిగా సుత్తిలేకుండా విషయంలోకి వస్తాడు.

చెప్పే anecdotes కూడా చాలా ఉపయోగకరం. పుస్తకాల సైజు కూడా ఎంత ఉండాలో అంతే ఉంటుంది.

ఇంతకీ Syd Field Trilogy అంటే ఏ పుస్తకాలు?

ఆయన వ్రాసినవి మొత్తం ఏడు పుస్తకాలున్నాయి. వాటిలో నేను సిడ్ ఫీల్డ్ ట్రైలజీగా చెప్పేవి ఇవీ…

1) Screenplay

2) Four Screenplays

3) The Screenwriter’s Workbook.

మిగిలిన పుస్తకాలనూ తిరగేశాను గానీ, స్క్రీన్ రైటింగ్ పరంగా మన Indian Context కి అంత ఉపయోగ పడుతాయని నేను భావించటం లేదు.

మొదట ‘స్క్రీన్‌ప్లే’ చదివాక, ఏవన్నా ఓ నాలుగైదు సినిమాల స్క్రీన్‌ప్లే లను తీసుకుని, పుస్తకంలో చెప్పిన విధంగా ఎనలైజ్ చేసుకోవాలి. దాని వల్ల కాస్త application తెలుస్తుంది. తరువాత Four Screenplays చదివితే, మన ఎనలైజేషన్ ఎలా ఉందో ఒక అవగాహనకు వస్తాము. తరువాత పట్టుకోవాల్సింది… వర్కుబుక్. కాస్త శ్రద్ధగా చదవాల్సిన పుస్తకం. చర్విత చరణం అనిపిస్తుంది కానీ, బాగా ఆసక్తికరంగానూ చదివిస్తుంది. కానీ ఈ పుస్తకం చదవటం చాలా ముఖ్యం. అందులో చెప్పిన విధంగా ఫాలో అవుతూ, అందులో ఇచ్చిన ఎక్సెరెసైజుల్ని చేస్తే కనుక మంచి ప్రాక్టీస్ అవుతుంది. ఈ పుస్తకం పూర్తి చేస్తే, స్క్రీన్ రైటింగ్ మీద మంచి అవగాహన వస్తుంది.

ఇక్కడో చిన్న మాట చెప్పాలి. స్క్రీన్ రైటింగ్‌ని సీరియస్‌గా తీసుకునే పనైతే ఒక మంచి ఎక్సెరెసైజుంది. అదేమిటంటే, ఒక సినిమాను చూసి, దాని స్క్రీన్‌ప్లేని వ్రాసే ప్రయత్నం చేయటం. చేసి, అసలు స్క్రీన్‌ప్లేతో కంపేర్ చేసుకోవటం.

దీని వల్ల లాభాలు…

1) మనమెక్కడ ఉన్నామో తెలుస్తుంది.

2) మన లోపాలూ తెలుస్తాయి

3) ఒరిజినలు స్క్రిప్ట్ లో ఉన్న లోపాల పట్ల అవగాహన కలిగి మనమా తప్పులు చెయ్యకుండా ఉపయోగ పడుతుంది.

4) అక్షరాల్లో ఉన్నది తెర మీదకు ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో ప్రాక్టికల్ గా తెలుస్తుంది.

ఇప్పుడు కొరియానంలో ఈ విషయాలు ఎందుకు వచ్చాయంటే ప్రపంచంలో Screenplay లు రెండు రకాలుగా burning (అంటే తగలడ్డాయి అని). ఒకటి Hollywood or Universal Style అని. రెండోది World Cinema or Non-Hollywood style అని. దీన్నే క్రియేటివ్ స్కూల్ అని కూడా అంటారు. అంటే ఏ రకమైన structure లేకుండా మా ఇష్టమొచ్చినట్లు రాస్తాం అనే తరహా.

ఇవి కాకుండా మనిండియా తరహా ఫస్టాపు, సెకండాపు (నేనైతే ఆపను గాక ఆగను). కాకపోతే ఇది కూడా Hollywood Style లో పడుతుంది. అప్పుడే రాణిస్తుంది.

Structure వాడుతూ మనం ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా, మన క్రియేటివ్ తెలివితేటలు చూపించినా మన Screenplay నడుస్తుంది. లేకపోతే తిరక్కథలో కథనాయిక పరిస్థితవుతుంది. లేదా మన సుఖీ early జీవితంలా burn (తగలడుతుంది).

గత ఎపిసోడ్‌లో నేనొక మాట చెప్పాను.

కొరియాలో చెత్త కింద జమకట్టిన చాలా సినిమాలు కూడా మనవాళ్ళకు (ప్రపంచవ్యాప్తంగా ఇతరులకు కూడా) కాస్తో కూస్తో నచ్చటానికి కారణం ఏంటా అని బుర్రలు బద్దలు కొట్టుకోనవసరం లేదు. వారు కథా కథన బేసిక్స్‌కు కట్టుబడి ఉంటారు. ఎన్ని సాముగరిడీలు చేసినా మనవారిలా నేల విడిచి కాకుండా నేల మీదే చేస్తారు.

అలాంటి నేల మీద సామునే మన పార్క్ చేశాడు The Handmaiden తో.

కథ, కథనాలు కాస్త నమ్మశక్యం కాని విధంగా ఉంటాయి. ప్రత్యేకించి ఆ కాలానికి. అప్పటి పరిస్థితులకు. కానీ, ఈ నేల విడువని సామే, మనల్ని సినిమాలో లీనమయ్యేలా చేస్తుంది.

Chapter 27

Fingersmith నవల చదివిన వారికి (కథ తెలిసిన వారికి), అందులో ఎక్కువ భాగం కథనం Scripted అని తెలుస్తుంది. అంటే… అటు అజంటిల్మన్ ఆట అయినా అయి ఉంటుంది (Mrs. Sucksby involvement తో) లేదా మాడ్ భ్రమ పడ్డట్లు ఆమె కంట్రోల్‌లో అన్నా ఉంటుంది. ఆ కంట్రోల్ అన్నది నిజానికి అజంటిల్మన్ Richard Rivers చేతిలోనే ఉందని, చివరికి అతను హతుడు కాకపోతే అందరూ అతని ఆటలో పూర్తి పావులుగా మిగిలిపోయే వారని కూడా అర్థమవుతుంది.

ఇక్కడే, Victorian Society లో స్త్రీల మీద పురుషాధిపత్యం రూపాలు మార్చుకునైనా ఎలా పని చేసిందో చెప్తుంది సారా వాటర్స్. అక్కడే ఫెమినిస్ట్ భావాలను చాలా సటల్‌గా చూపింది. ప్రశ్నలు రేపి, వాటికి బదులిచ్చే ప్రయత్నం చేసింది.

కానీ, ఇక్కడ సినిమాలో ఆట తడవకొకరి చేతుల్లోకి మారుతుంది. పావులు కూడా తదనుగుణంగా మారినా, చూస్తూ ఊరుకోరు నవలలో లాగా. ఎవరి స్థాయిలో వారి తెలివితేటల కనుగుణంగా ఆధిపత్యపోరుకు తెరతీస్తారు.

దాంతో Deus ex Machina అవసర పడదు. పాత్రలన్నీ, passive గా కనిపించిన సందర్భాలలోనూ active గా ఉంటాయి. తమ మెదడుకు రాపిడి పెడుతూనే ఉంటాయి. అలా అని హృదయం లేని పాషాణాలా అంటే కావు కూడా. అంతర్లీనంగా గుండె చెమ్మ ఆరని మనుషులే అందరూ. ఒక్క అజంటిల్మన్ తప్ప.

అయితే పార్క్ తనదైన శైలిలో ఆ పాత్రను నడిపి అతని మీద కూడా కాస్త సానుభూతి కలిగేలా మలుస్తాడు. కానీ, Oldboy నాటి నుంచీ తన సినిమాల గురించి చెప్పినట్లు మనని పాత్రలతో పూర్తిగా సహానుభూతి చెందవద్దని హెచ్చరిస్తాడు. వాటిని ఒక third person observer లాగా చూసి, ఆలోచించి వదిలేయమంటాడు.

ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో ఎందుకలా తన కథలలోని పాత్రలతో మమేకం కావద్దని హెచ్చరిస్తారు అని అడిగిన ప్రశ్నకు పార్క్ సమాధానం…

“గత సినిమాల్లోని పాత్రలతో మమేకమైతే, కొత్త సినిమాలలో పాత్రలను ఎవరు పట్టించుకుంటారు?”

P.S.: ఈ సమాధానం చదివాక Thug Life మ్యూజిక్ Hum చేసుకోండి

(సశేషం)

Exit mobile version