Ephemeral Moonshine On The Shadows of the Past (continues)
Chapter 44 (continues)
ఆశ్రమంలో కాలం గడుస్తూ ఉంటుంది. శిష్యుడు టీనేజ్‌కు వస్తాడు. గురువు చెప్పిన పాఠాలను నేర్చుకునే ప్రయత్నంలో తనను తాను కోల్పోయినాడా? లేక ఆ బోధల వల్ల పరిపూర్ణుడైనాడా అన్న అతని డైలమా తీరటం లేదు. గురువును మటుకూ మౌనంగా అనుసరిస్తున్నాడు. ఎందుకంటే గురువు తనను సంస్కరించేందుకు వేసే శిక్షలు.. అదన్నమాట సంగతి!
కొంత కాలం గడుస్తుంది. అలా నీటి మీద తేలే వారి ఆశ్రమంలో జీవనం కూడా విచిత్రంగా ఉంటుంది. కదిలే కాలానికి గుర్తులా. ఇంతకు ముందు చెప్పిన చేప, కప్ప, పాము లకు కూడా బుద్ధిస్ట్ సింబాలిజమ్ ద్వారా వ్యాఖ్య చేయవచ్చు. దర్శకుడి అసలు ఉద్దేశం కూడా అదే.
ఒకరోజు ఆ ఆశ్రమానికి ఇద్దరు స్త్రీలు వస్తారు. ఒకరు టీనేజర్. మరొకరు నలభై దాటని మనిషి. తల్లీ కూతుళ్ళు. ఆ పిల్లకు అనారోగ్యం. దానిని రూపుమాపటానికి గురువు సహాయం కోరి వస్తుంది తల్లి. దేశాలు, ప్రాంతాలు ఏవైనా మనుషుల నమ్మకాలు దాదాపు ఒకటే. వారి భయాల లాగా.
కాస్త persuasion తరువాత గురువు ఆ పిల్లను అక్కడ ఉండేందుకు అనుమతిస్తాడు. శిష్యుడికి పరీక్షగా ఆ పిల్ల బాధ్యత అప్పగిస్తాడు. ఒకవైపు మెడికేషన్ సాగుతుండగనే, టీనేజర్ అయిన శిష్యుడు చైనా కాలేజ్‌ల ఐకన్ బ్యాచ్‌లో చేరతడు. వయసు ప్రభావం చేత. వారిద్దరి ఫిజిక్సు మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. లెక్కలేసుకుని మరీ అడవిలోకి అర్ధరాత్రిళ్ళు వెళ్ళి ప్రేమించుకుంటుంటారు. అప్పటికింకా ఓయోలు వచ్చినట్లు లేదు.
ఒక శుభరాత్రి గురువుగారు వీరి కదలికలను పసిగడతారు. మరుసటి దినం రాత్రి వారిననుసరించి పడవలో వెళ్ళి వారిని కెమిస్ట్రీ లేబ్‌లో ఉండగా ఎర్ర చేతులతో పట్టుకుంటారు.
శిష్యుడు చిన్నప్పటి శిక్షలు గుర్తొచ్చి ఒణికిపోతాడు. కానీ ఆయన ఒక్క మాట కూడా అనరు. వదిలేస్తాడు.
అవ్వకిక్కడే అనుమానం వచ్చింది. ఒక్క చిన్న Apple తిన్నందుకే మనని ఈడెన్ నుంచి దేవుడు తరిమేశాడు. చాలా శాపాలిచ్చాడు. మనకాకలి తీరేందుకు Apple ఇచ్చిన పామును సాతాను అన్నాడు. మరి వీళ్ళు వీళ్ళ లెక్క ప్రకారం ఇన్ని నేరాలు చేసినా శిక్షలు ఉండవా అని.
ఉన్నట్లుండి అవ్వకు కయీను గుర్తొచ్చాడు. మిగిలిన ఒక్క బిడ్డ కూడా దూరమై కుమిలిపోతున్న అవ్వ, డిప్రషన్ లోకి వెళ్తోందని గ్రహించిన ఆదాము ఆమె మనసు మరల్చేందుకు అలా నడుస్తూ పోదామంటాడు. వెళ్ళగా వెళ్ళగా వారికి అడవిలో బంగారు వర్ణం కలిగిన Apple కనిపిస్తుంది. అవ్వకు యవ్వనపు రోజులు గుర్తొస్తాయి. పరిగెత్తుకుని వెళ్ళి ఆ Golden Apple ను పట్టుకొస్తుంది. ఆదాము కాస్త దూరం నుంచీ ఇది గమనించి దాన్ని కొరికి తనకొక ముక్క తినిపించమంటాడు.
అవ్వ ఆ Apple ను కొరుకుతుంది. చాలా రుచిగా అనిపిస్తుందా Apple. ముక్కను నవులుతూ ఆ Apple ను చూసి అబ్బుర పడుతుంటుంది. ఇంతలో ఆ Apple లో నుంచి ఒక చిన్న పాము, చూపులు వేలులో సగం సైజు మాత్రమే ఉన్నది బైటకు వచ్చి, పాత స్నేహితులకు పాము చివరి వీడ్కోలు చెప్పమన్నదని చెప్తుంది అవ్వతో. కానీ, జీవితపు రుచిని అందించిన Apple ముక్కను నములుతున్న అవ్వ పాము మరణానికి బాధ పడదు. కానీ పాత మిత్రునికి ఘనమైన వీడ్కోలు దక్కిందా అని అడుగుతుంది.
చిన్నపాము గంభీరంగా దైవపుత్రుడు భవిష్యత్ మానవాళి కోసమెలాంటి మరణం పొందుతాడో అలాంటి మరణమే తన Oldboys కోసం పాము కూడా దక్కించుకుందని చెప్పి goes ग़ायब।
ఆ మర్నాటి నుంచి అవ్వలో మార్పు. మునుపటి అవ్వ కనిపిస్తోంది ఆదాముకు. సరసమాడుతూ అన్నాడు. అసలేం జరిగింది నిన్న అని. విషయం చెప్పింది అవ్వ. గతంలోలా ఒక కథ చెప్పినట్లు చెప్పింది. కయీను గురించి దిగులు లేదా అని అడుగుతాడు. లేదంటుంది. అతని చర్యలకు అతనే బాధ్యుడని, తల్లిదండ్రులను చూడాలనుకుంటే అతనే వస్తాడని, రాకపోయినా పిల్లలిద్దరి చిన్నప్పటి జ్ఞాపకాలు తల్చుకుంటూ తామిద్దరూ గడపవచ్చని అంటుంది. అవ్వలో ఈ మార్పు చూసి సంతోషిస్తాడు.
మూడ్‌ను చెడగొట్టుకోకూడదని, Spring Summer Fall Winter.. and Spring వదిలేసి మరో సినిమా గురించి ఎత్తుకుంటాడు. ఆ సినిమానే..
I’m a Cyborg, But That’s OK
నా మనసులోని వేదన హఠాత్తుగా మాయమైనట్లుగానే, ఏదైనా చిప్ ద్వారా మానవుల మనసు మార్చవచ్చా అని అవ్వ అడుగుతుంది. మార్చవచ్చంటాడు ఆదాము. దాని బదులు హాయిగా మర మనుషులుగా మారితే ఇంకా బాగు అని హాస్యమాడతాడు. అసలు పిచ్చివాళ్ళం అయిపోయి, ప్రపంచాన్నే మర్చిపోతే ఇక ఏ సమస్యా ఉండదేమో అని మనసులో అనుకుంటాడు.
అదెలా సాధ్యం అని అవ్వ ఆశ్చర్యపోతుంది. అప్పుడు చెప్తాడు Park Chan-wook తీసిన 2006 సినిమా I’m a Cyborg, But That’s OK గురించి.
After completing the epic Vengeance Trilogy, Park Chan-wook wanted to change the genre he’s doing films in and wanted to explore comedy. He was also fascinated by the early and mid 2000s science fiction films from Hollywood and elsewhere where a sort of pop cultural philosophy is explored without having to take things too seriously. The result is I’m A Cyborg, But That’s OK sating the heroine of that decade, Im Su-jeong, and Rain.
ఈ Rain అసలు పేరు Jung Ji-hoon. కొరియాలో ప్రముఖ పాప్ సింగర్. 2003లో వచ్చిన Sang Doo: Let’s Go To School అనే సినిమాతో పైకొచ్చాడు. 2004లో తూర్పు ఆసియాలో మోత మోగించి జనాలకు కొరియన్ సీరీస్ లను చూడటం ఒక వ్యసనంలా మార్చిన రొమాన్టిక్ కామెడీ Full House తో స్టార్డమ్ పొందాడు. దాదాపు అరడజను కొరియన్ ఆల్బమ్‌లు, ఒక జాపనీస్ ఆల్బమ్‌లు చేసాడు.
2004 లోనే వచ్చిన It’s Raining అని వచ్చిన పాప్ ఆల్బమ్‌తో Korean musical scene లో superstar గా నిలిచాడు. పదిహేను పాటలున్న ఈ ఆల్బమ్ లో ప్రతి పాటా ఒక ఆణిముత్యమే. మాంఛి రొమాన్టిక్ మూడ్ క్రియేట్ చేస్తాయి. అందులో టైటిల్ సాంగ్ దాదాపు ఏడాది పాటూ మ్యూజిక్ చార్టులలో నంబర్ వన్ గా నిలిచి అతన్ని అంతర్జాతీయంగా సెలబ్‌ను చేసింది.
దాంతో హాలీవుడ్ సినిమా Speed Racer లో ఒక గుర్తింపు ఉన్న పాత్ర దక్కేలా చేసింది. The Ma-trix తీసిన The Watchowskis దర్శకత్వం వహించిన ఈ సినిమాలో Rain ను చూసిన మన పార్క్, నటనలో అతని ఈజ్‌ను చూసి సైబోర్గ్ కోసం తీసుకున్నాడు. ఇక Im Soo-jeong గురించి మనకు తెలిసిందే. …Ing లో మిన్-ఆ గా అదరగొట్టిన ఇమ్ అంతర్జాతీయ హిట్ హరర్ A Tale of Two Sisters తో మహా నటి గా గుర్తింపు పొందింది.
The Baby faced actress Im Soo-Jeong played the title role in the typical Park Chan-wook style of satire on both comedy and science fiction. She was her usual self with inch perfect display of emotions while Rain proved himself to be a revelation.
చాలా తక్కువ బజట్ లో చాలా ఎక్కువ క్వాలిటీ ఔట్పుట్‌తో వచ్చిన ఈ సినిమా పెద్ద హిట్ అయింది. కానీ, ఎందుకో Vengeance Trilogy అంత పాప్యులర్ కాలేదు కొరియా అవతల. అక్కడ మాత్రం ఒక కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది.
కథ కమానిషులతో పాటూ మన పార్క్ mastery in the craft గురించి తరువాత ఎపిసోడ్‌లో..
ఈలోగా కే విశ్వనాథ్ గారి లెగసీని గౌరవించటం మానేసి కుక్కమూతి పిందెల మీద ఈకలు పీకుదాం. తెలుగూఫ్ లుగా మన చేతనైనంత కంపు చేద్దాం. యదవాయిత్వానికి చిరునామాగా నిలుద్దాం.
(సశేషం)
నా గురించి నేను చెప్పుకుంటే అది సెల్ఫ్ డబ్బా (SSSA). వేరే వాళ్ళైతే వాళ్ళ వాళ్ళ వర్షన్లు చెప్తారు. కనుక నేను రాసిన దాన్ని బట్టీ నా రచనల గురించి మీరే ఒక అంచనా వేసుకోండి. అది చాలు. భవిషత్ లో కలవాల్సి వస్తే అప్పుడు నా గురించి ఫస్టు హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మీరే తెలుసుకోవచ్చు. ఠీక్ హైఁ? 🙂
తెలుగు వాడినే అని చెప్పేందుకు సాక్ష్యం: నాకు తెలుగు రాదు.
గీతాచార్య