Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కొరియానం – A Journey Through Korean Cinema-57

తిరక్కథ 3

Chapter 50 – Violence Is A Fashion

సాధారణంగా సినిమాలను.. చరిత్రను రాసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, రకరకాలుగా విభజిస్తుంటారు. ప్రేక్షకులను బట్టీ క్లాస్, మాస్ అనీ, కథా కథనాలు-స్టైలును బట్టీ (ఈ butt tea కాదు) జాన్రాలుగాను.

వాటితో పాటూ విమర్శకులు, బాక్సాఫీసు పండితులు, ప్రేక్షకులు ఇంకో రకం కేటగిరీలగా సినిమాలను లెక్క వేస్తారు (not counting). అదే..

ఆర్టు సినిమా లేదా కళాత్మక సినిమా అంటే అందరికీ తెలిసిందే. చాలామందికి అదొక బూతు పదం. అవార్డు సినిమాలు అని ఇంకోరకంగా వాటిని ట్రోలుకుంటారు.

ఇక కమర్షియల్ సినిమా అంటే ఇంకొందరికి అంటరాని వస్తువు. అదేదో దాని గురించి మాట్లాడితే పంచ మహాపాతకాలు చుట్టుకుంటాయి అన్నట్లు ప్రవర్తిస్తారు.

చివరికి మూడోరకం కల్ట్ సినిమాలు.

ఒకానొక సందర్భంలో అవి సరిగ్గా ఆడని సినిమాలు. వాటిలో ఏదోక మెరిట్ ఉండి ఉంటుంది. కానీ అందరికీ నచ్చకపోవచ్చు. కొన్ని వర్గాలకు మాత్రం విపరీతంగా నచ్చుతుంది. వాటిని కల్ట్ సినిమాలు అంటారు.

సాధారణంగా violent, exploitative (to be precise bordering on exploitation), controversial films come under this category.

యథావిథిగా మన తెలుగూఫభిమానులకు పోకిరి, మగధీర కూడా కల్ట్ క్లాసిక్కులే 😀😀😀. పదాలకర్థాలను కంపు చేసేయటంలో మనవాళ్ళు సూపరుమ్. By the way, మన పెళ్ళి చూపులు మలయాళ రీమేక్ టైటిల్,

విజయ్ సూపరుమ్ పౌర్ణమియుమ్.

ఈమధ్య మన వైపు బాగా పాప్యులర్ అవుతున్న ఐశ్వర్య లెక్ష్మి (Aishwarya Lakshmi) అందులో కథానాయిక. అసిఫ్ అలీ కథానాయకుడు. విజయ్ దేవరకొండ స్థాయిలో అతనా పాత్రను పండించలేకపోయాడు. సినిమా ఒక మాదిరిగా ఆడింది. ఐశ్వర్య లెక్ష్మి పొన్నియిన్ సెల్వం లో పూంగుழళి గా చేసింది. పాత్ర పోషణ కన్నా వేరే రకంగా ఫేమస్ అయింది. అయినా she’s a decent actress.

అలా mainstream హిట్ సినిమాలను కూడా కల్ట్ జాబితాలో చేరుస్తారు మన తెలుగూఫభిమానులు. వెంకీలో జీఎమ్ బదులు ఎక్కువక్షరాలు ఉన్నాయని రవితేజ ఏజీఎమ్ పోస్ట్ కోరుకున్నట్లు. క్లాసిక్ ముందు కల్ట్ చేరుస్తే అదేదో మరింత గొప్పగా ఎలివేట్ అవుతుందన్నట్లు. అప్పుడెప్పుడో ఆయనెవరో పదం గంభీరంగా ఉందని ఇంకో పెద్దాయనకు ఉత్తరం రాస్తూ గంగా భాగీరధీ సమానులైన (some generic) రావు గారికి అని రాసినట్లు.

సరే!

ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం. ఈ కల్ట్, niche సినిమాలు త్వరగా అందరికీ చేరవు. కల్ట్ అంటే ప్రత్యేకించి ఒక వర్గం చాలా వోకల్‌గా డిఫెండ్ చేస్తారు. వారి వారి వాయ్స్ గట్టిగా గోల చేసి మరీ వినిపిస్తారు.

అదే niche subjects ను చాలా తక్కువ మంది consume చేస్తారు. అందువల్ల ఎవరో ప్రత్యేకించి వాటికోసం చూసేవారికి తప్ప అందరికీ వాటి గురించి తెలియదు. లేదా తెలిసినా పట్టించుకోరు. ఇదిగో.. ఈ కొరియానం లాగా.

మన పార్క్ చాన్-వుక్ సినిమాలను చాలామంది అభిమానిస్తారు. కానీ part లు part లుగా. ఎలాంటి సినిమా తీసినా అది సంపూర్ణంగా అందరికీ నచ్చకపోయినా చాలామంది చూసేందుకు ఆసక్తి కలిగి ఉంటారు. కారణం.. తన సినిమాల్లో అటు mainstream commercial cinema elements పుష్కలంగా ఉండేలా చూసుకుంటాడు.

Art cinemas ని మించి detailing ఉంటుంది. అనవసర ఎచ్చులు లేకుండా జాగ్రత్త పడతాడు. నటుల స్వాగర్, పాత్రలను ఎలివేట్ చేయడు. Filmmaking ను ఎలివేట్ చేస్తాడు. వీలైనంత matter of fact గా narration ఉంటుంది. మనం గతంలోనే చెప్పకున్నాం కదా. పార్క్ మనల్ని సినిమా మీద invest చేయమని అంటాడు తప్ప పాత్రల మీద కాదు.

వీటితో పాటూ, క్వెంటిన్ టారంటినో లాగా controlled exploitation elements చేరుస్తాడు. Cult audience ను మచ్చిక చేసుకునేందుకు. ఇందుకే కొంతమంది విమర్శకులు అతని సినిమాల మీద నెగటివిటీ వెళ్ళగక్కుతారు. కానీ మిగతా కల్ట్ సినిమాలలో లాగా ఇతని సినిమాలు వైలెన్స్‌ను గ్లోరిఫై చేసి జనాలను addict అయ్యేలా చేసేందుకు, వారి vanity కి అప్పీలింగ్‌గా ఉండి గ్రిప్‌లో పెట్టుకునేందుకు ప్రయత్నించవు.

On the contrary, ఆ యా cult appealing elements ను నిరసిస్తాడు. దానికే అలా చేస్తాడు.

Oldboy లో ప్రైవేట్ జైలర్ Park Cheol-woong పళ్ళను ఒక్కొక్కటీ పెకిలించే సీన్ చూడండి. మనకొక్కొక్కసారి ఎవరి మీదన్నా కోపం వచ్చినప్పుడు వాళ్ళను చంపేస్తాం అంటాం. మనసు తెఱ మీద రకరకాలుగా వాళ్ళను కొట్టటమో, చంపటమో చేస్తాం. లేదా హింస పెట్టినట్లు ఊహించుకుని ఒక రకపు తృప్తి పొందుతాం.

విసిగిస్తున్న పిల్లల్ని తోలు తీస్తా అని బెదిరిస్తాం. కానీ నిజంగా ఒక్కసారి ఆ ముద్దు మోము ఉన్న పిల్లలకు తోలు మీరే తీస్తున్నట్లు ఊహించుకోండి.

ఒళ్ళు గగుర్పొడుస్తోంది కదా. ఏడుపు ఆగటం లేదు కదా. Oldboy సినిమా, అందులో ఆ పళ్ళు పెకిలించే సీన్ చూసి చీటికీ మాటికీ పళ్ళు రాలగొడతా అనే ఒక తండ్రి ఆ మాట అనటం మానేశాడు. అంటే పార్క్ అసలు ఉద్దేశ్యం నెరవేరినట్లేగా?

అదే నిజంగా exploitative manner లో తన సినిమాలను తీస్తే మనకూ అలాగే చేయాలనిపిస్తుంది. అదేదో సింహం హీరో గారి సినిమాలో తలలు ఎగిరి పడ్డట్లు. మన తెలుగు సినిమాలలో పళ్ళు రాలటం కూడా స్టైలిష్ గా తీసి కామెడీ effect కోసం వాడతారు. ఇప్పుడు ఎవరిది exploitation సినిమా?

పార్క్ తన సినిమాలలో slow motion violent action scenes ను ఆ వైలెన్స్ ను amplify చేసి మనకు జుగుప్స కలిగించేందుకు వాడతాడు. దానికో పర్పస్ ఉంటుంది. కానీ, 2020లో వచ్చిన ఒక సూపర్ డూపర్ హిట్ అయిన ఒక family director తీసిన family entertainer సినిమాలో ప్రతి action sequence ను slow motion లో స్టైలుగా తీసాడు. అది చూసి అంతే చులాగ్గా ఆ సినిమాలో హీరో లాగా ఆ సినిమాలో పాట పాడుతూ ఒక అనకొండ తన తమ్ముడి భుజం మీద ఎక్కి, మెడ మీద పెన్సిల్‌తో పొడవబోయాడు. దాంట్లో లాగనే ఒక చిన్న పిల్లాడు తన చెల్లెలి legs చూడటం మొదలు పెట్టాడు.

దీనివల్ల నెగటివ్‌గా దేనివల్ల పాజిటివ్‌గా influence అయ్యారు? అవుతున్నారు?

ఇక్కడో రహస్యం చెప్పాలి.

Oldboy చూశాక భవదీయుడు గీతాచార్య గాసిప్స్‌ను పూర్తిగా దూరం పెట్టేశాడు. భవదీయుడు అని వాడినందుకు పవన్ కళ్యాణ్ అభిమానులు కోపగించుతుంటే फरवा இல்லை. I don’t care.

Park Chan-wook satisfies mainstream audience with commercial elements, stylised filmmaking. He adds artistic touch to all his films. He also conjures positive reception from cult style audience who love exploitative films but subverts their expectations and make them feel averse of what they love actually – the violence or grotesque sexual violence.

The Handmaiden has every such trick from Park.

వేగవంతమైన కథాకథనాలు, star lead actors, symphonic musical score.. ఇత్యాదులతో mainstream audience ను సంతృప్తి పరిచాడు. తన సినిమాటిక్ ఆర్ట్‌ను తారాస్థాయికి చేర్చి artistic bent of mind ఉన్న వారిని ఆకట్టుకున్నాడు. తగు మోతాదులో టార్చర్, వైవెంట్ సెక్స్, లెస్బియన్ థీమ్ తో అటు cult style audience కు వల వేసాడు. కానీ, ‘bordering on exploitation’ అన్న restraint తో, చూసిన వారికి sadistic pleasure కాకుండా అక్కడ కలగాల్సిన ఎమోషన్ కలిగేలా చేసాడు.

మన సినిమాల్లో అత్యాచార సన్నివేశాలను కూడా మగ ప్రేక్షకులను రెచ్చగొట్టేందుకు వాడతారని 1970ల, 1980ల హిందీ సినిమాల మీద తెగ ఆర్టికిల్స్ రాసారు కదా.

ఇంకో రహస్యం చెప్పాలి. రోజువారీ ఫ్యాపింగ్ కార్యక్రమం కోసం ఫలానా హీరోయిన్ అ**ర సీన్ అని చేసే సెర్చ్‌లు images.Google.com ప్రతి రోజూ కన్సిస్టెంట్‌గా టాప్ 15లో ఉంటున్నాయి గత 15 సంవత్సరాలుగా. చెప్పటానికి బాధగా ఉన్నా, అలాంటి screen grabs తీయటం కూడా ఒక కుటీర పరిశ్రమ. కానీ వీటిని గురించి ఎవరూ పట్టించుకోరు.

Violence and abuse shouldn’t be commoditised. Period (మీక్కావాల్సిన అర్థం తీసుకోండెహే period కు).

Chapter 51

సుఖీని ఎసైలమ్‌లో పడేసి లేడీ హిడేకోతో వెళ్ళి పోతాడు మన అజంటిల్మన్ ఫుజివారా (సినిమా). సుఖీ లేడీ హిడేకో అనే పేరుతో ఎసైలమ్ లో చిక్కుకుపోయింది. లేడీ హిడేకో సుఖీ అనే పేరుతో అజంటిల్మన్‌తో వెళ్తుంది. తనకు ఆమె మీద ఉన్న ప్రేమంతా ఒలకపోసి తనను పెళ్ళి చేసుకోమంటాడు అజంటిల్మన్.

కానీ, లేడీ హిడేకోకు తన reservations తనకు ఉంటాయి. అయినా తప్పదు కనుక తలొగ్గుతుంది. కాస్త అనుమానంగానే సరే అంటుంది.

కానీ అప్పుడే అజంటిల్మన్ పెద్ద తప్పు చేస్తాడు. కావటానికది ఒక చిన్నమాట. అయినా అతను చేస్తున్న manipulations ను మొదటి నుంచి గమనిస్తున్న లేడీ హిడేకోకు అతని మీద genuine hatred కలుగుతుంది.

పెళ్ళి చేసుకున్నాక సుఖీ గురించి మాట్లాడుతూ చాలా కేజువల్‌గా నవ్వుతూ అదీపాటికి చచ్చూరుకుని ఉంటుంది అంటాడు.

తప్పో ఒప్పో సాటి మనిషిని అవసరార్థమో ఇంకెందుకో మోసం చేసాడు సరే! ఆ జీవి మీద కనీస సానుభూతి కూడా లేకుండా ఆమె మరణాన్ని అంత తేలిక చేసి చెప్పటం లేడీ హిడేకోకు అసలు నచ్చదు. అతని మీద ఏహ్యభావం కలుగుతుంది. రేప్పొద్దున తనకన్నా గొప్ప కనక్షన్ దొరికితే తననూ సుఖీని తీసి పడేసినట్లు తీసి పడేస్తాడని అనుకుంటుంది.

ఇటువైపు సుఖీ అసైలమ్‌లో మొదట నిబ్బరంగా ఉంటుంది. కానీ, క్రమంగా మానసికంగా దెబ్బతినటం మొదలు పెడుతుంది. నవలలో Susan Trinder లాగా. నవలలో deus Ex Machina వాడుతుంది ఒకరకంగా రచయిత్రి. కాస్త accidental escape. కానీ ఇక్కడ సుఖీది కొంత వరకూ orchestrated escape.

సుఖీ స్నేహితుడుంటాడు Bok-soon అని. అతను వచ్చి ఎసైలమ్ కు అగ్గెడతాడు. తరువాత తీరిగ్గా ఒక firefighter లాగా వచ్చి సుఖీని తప్పిస్తాడు.

సుఖీ ముందుగా లేడీ హిడేకోతో ప్లాన్ చేసిన విధంగా వాళ్ళు అనుకున్న చోటుకు చేరుతుంది. నవలకూ, సినిమాకూ ఇదే తేడా. నవలలో సుఖీ equivalent Sue ఇంత మాయ చేయదు. ఇక్కడ సుఖీ active player. Lady Hideko తో కలిసి మాస్టర్ ప్లాన్ వేస్తుంది. అందులో అజంటిల్మన్ తనకు తెలియకుండానే పావుగా మారతాడు.

సుఖీ వచ్చే టైమ్‌కు లేడీ హిడేకో ఫుజివారాకు ఓపియమ్ ఇచ్చి మత్తులో పడి ఉండగా అన్నీ సర్దుకుని ఉడాయిస్తుంది.

అదే సమయంలో లేడీ హిడేకో సుఖీ చెప్పిన విధంగా తన అంకుల్ కౌజుకీ కి ఒక ఆకాశ హిడేకో ఉత్తరం రాస్తుంది. ఫుజివారా చేసిన మోసం తెలుసుకుని చిర్రెత్తిన కౌజుకీ అతన్ని బంధించి టార్చర్ పెడతాడు. ఎన్ని రకాలుగా అడిగినా లేడీ హిడేకో గురించి అతనికి అవసరమైన సమాచారం రాదు. పైగా తమ వివాహం consummate కాలేదని గుర్తుచేసుకుంటాడు. దీంతో తన దగ్గర ఉన్న erotic literature లో ఉన్న రకరకాల మెథడ్లు, వాటిలో వాడిన వస్తువులను ఉపయోగించి అజంటిల్మన్ ఫుజివారాను ఆటాడుకుంటాడు కౌజుకీ.

చివరకు తన సిగరెట్ బాక్స్‌లో నుంచి ఒక సిగరెట్ ఇస్తే అది కాల్చాక చెప్తా అంటాడు. సరే అని ఇస్తాడు కౌజుకీ. ఆ సిగరెట్ నుంచీ నీలపు రంగు పొగ వస్తుంది. నీ సిగతరగా, ఈ సిగరెట్లలో పాదరసం కలిపాను. నా పని ఐపోయిందని తెలుసు. నాతోపాటూ సరదాగా నువ్వు కూడా ఆచ్చి వచ్చేయ్ అని తల వాస్తేస్తాడు.

చివరి దృశ్యం

సుఖీ, లేడీ హిడేకో లు ఒక నౌకలో చైనాకు తప్పించుకుంటారు. జనంతో సమస్య లేకుండా లేడీ హిడేకో మగ వేషంలో.

ఇంత చేసినా సుఖీ కాకుండా డబ్బు ఉన్నది కనుక లేడీ హిడేకోనే మగ వేషం వేసుకుంది.

వివక్ష. వివక్ష. Brahminical Patriarchy in Korea 😉

లేడీ హిడేకో ఎంత వరకూ సుఖించిందనేది ఊహకే వదిలేస్తాడు పార్క్.

ఈ మూడో పార్ట్ లేదా మూడవ యాక్ట్‌లో ఇంత intriguing play ని జేమ్స్ కామరాన్ తరహాలో యాక్షన్ సన్నివేశాలుగా కాకుండా డ్రామాగా మార్చి రక్తి కట్టిస్తాడు పార్క్. ఫెమినిజమ్, class differences, societal role in the development or ruining of individuals, freedom, sadism.. అబ్బో.. ఇలా చాలా విషయాలు చర్చిస్తాడు. తరువాత మడతెట్టి అవతల పడేస్తాడు.

మరో అంకం సమాప్తం!

PS: కొరియానం narrator (not GitacharYa) కు 50వ చాప్టర్‌లో విషయాన్ని బాగా ఆర్టిక్యులేట్ చేయటం రాలేదు. కానీ విషయం రీచ్ అయిందని లేదా అవుతుందని తెలుసు. కనుక, అలా adjust అయపోండి.

సివరఘా,

కేజీఎఫ్ అయిపోయింది. RRR ఆస్కార్ కూడా పాత పడింది. ఇప్పుడు కొత్తగా పడి ఏడవటానికి ఏమున్నాయబ్బా!

(సశేషం)

Exit mobile version