[శ్రీ జాడి రేవంత్ రచించిన ‘కొత్త భావం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
నీ చుట్టూ తిరుగుతున్నా
ఏం అనిపించలేదు నాకు
నీ బందుమిత్రులందరిని చూసా నీ చుట్టూ
ఏం అనిపించలేదు నాకు
నిన్ను చూసా మూడో పరిక్రమానికి
ఏం అనిపించలేదా నాకు?
ఏ గారడీ చేసావో గాని
నా చేతులు బిగుసుకు పోయాయి
గొంతు తడి ఆరింది
మదిలో తెలీని అర్థం అని మథనంతో
కోరానో కోరిక దేవుణ్ణి
అయ్యో నువ్వే కదా అది
తన కోసం,
నా వీరలక్ష్మి(అమ్మ) కోసం,
నేను ఎప్పటికీ చూడాలనుకునే దేవత కోసం
దీవన కోసం ఆ దేవుడికి దగ్గరికెళ్ళి మరీ కోరాను
నాకీ కొత్త అలవాటేంటో?
దేవా! ఇది నీ మాయేనా!
