[శ్రీ సాహితి రచించిన ‘కొత్త చెప్పులు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
కొత్త చెప్పుల్లా
కొత్త చుట్టాలతో..
పెద్ద పెద్ద అంగలతో
పొడవైన మాటలతో
వాళ్ల ఇళ్ల చుట్టూ
రోజూ హుషారే.
కాళ్ళసలు కాలవని
మెత్తగా, ఎత్తుగా ఉంటాననే
వడివడి నడకను చూసి
నులక మంచంలో
తాత బోసినవ్వు
హెచ్చరిక
“కొత్త చెప్పులు
కరుస్తాయి జాగ్రత్త”
ఎందుకైనా మంచిది
పాత చెప్పుల జతను
దాచి ఉంచుకొమ్మని..
