Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కొత్త కథాసంకలనం 2026 కోసం కథలకు ఆహ్వానం – ప్రకటన

[తన సంపాదకత్వంలో ప్రచురించనున్న కొత్త కథాసంకలనానికి కథలను ఆహ్వానిస్తున్నారు శ్రీ ఎన్. కె. బాబు.]

కథకుల సహకారంతో  కథలను ఓ సంకలనంగా ప్రచురించే ఓ ఒరవడిని తీసుకొని, ‘నాకు నచ్చిన నా కథ’ పేరిట నాలుగు సంకలనాలను, తర్వాత, కథ సౌరభాలు, కథా పరిమళాలు, కథా కుసుమాలు, కథా లోగిలి, కథ పున్నమి పేరుతో వరుసగా మరో మూడు సంకలనాలను, మొత్తం 9 కథా సంకలనాలును ఈ నాలుగు ఏళ్ళలో నేను ప్రచురించాను.

ఇప్పుడు 10వ సంకలనం కోసం శ్రీకారం చుట్టాము. మీకు నచ్చిన మీ కథను ఇదివరలో ఏదైనా పత్రికలో  ప్రచురించినదైనా, లేదా ఇటీవల వ్రాసినదయినా (4-6 పేజీల కథను) తేదీ 30-05-2026 లోగా పంపగలరు.

కథతో పాటు, మీ పాస్‌పోర్ట్ ఫోటో, మరియు మీ స్వీయ పరిచయం కూడా పంపగలరు. ప్రచురణ ఖర్చులు కోసం ₹ 2000/- పంపగలరు.

ఆవిష్కరణ రోజు వేదికపై రచయితకు 10 పుస్తకాలు గౌరవ అతిథుల చేతుల మీదుగా అందించబడతాయి. ఒకవేళ మీరు ఆవిష్కరణ సభకు హాజరు కాలేని ఎడల మీకు ఐదు పుస్తకాలు రిజిస్టర్ పోస్టులో పంపించబడతాయి.

మీతో పాటుగా, మీకు తెలిసిన కథకులకు, మరియు మీ సాహిత్య గ్రూప్‌లకు కూడా, ఈ సమాచారం అందించి, మన కథా సంకలనంలో ఎక్కువ కథలు వచ్చే విధంగా సహకరించగలరు.

కథలను nkbabu.publisher@gmail.com కు మెయిల్ చెయ్యండి.

లేదా  పోస్ట్ లో

N K Babu,
24-8-1,
Sameera Residencey,
Lingadhari Peta,
Vizianagaram 535002. AP.

చిరునామాకు పంపగలరు.

My Phone pay/Google pay number is 9440343479.

ధన్యవాదాలు

ఎన్. కె. బాబు

Exit mobile version