Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కొత్త మంత్రం

[శ్రీ జి.ఆర్.భాస్కర బాబు రచించిన ‘కొత్త మంత్రం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


ఒక్క వికృత ఆలోచన
ఎన్ని భయంకర సన్నివేశాలకు ఆలవాలమవుతుందో..
ఒక్క విద్వేషాగ్నికణం
ఎన్ని జీవితాలకు నిప్పు పెడుతుందో..
ఒక్క అనాలోచిత నిర్ణయం
ఎన్ని సమస్యలకు మూల బిందువవుతుందో..
ఒక్క చీడపురుగు
ఎన్ని జీవాలను మింగేస్తుందో..
కారణం ఏమైనా అన్నీ
మనుగడ అస్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి..
అస్తవ్యస్తపు నడతకు శ్రీకారం చుడుతున్నాయి..
‘అహింసా పరమో ధర్మః’ అని మాత్రమే కాదు..
ఎప్పుడయినా అవసరం అయినప్పుడు
మరచి పోయిన మరో వాక్యం
‘ధర్మ హింసా తథైవచ’ అనేదే
మన కొత్త మంత్రం కావాలి.
కూరుకుపోయిన చైతన్యాన్ని బయటకు లాగాలి..
పేరుకుపోయిన అలసత్వపు కుళ్ళును
సమూలంగా కడిగేయాలి.
అప్పుడు బయటికి వస్తుంది
అసలయిన మనిషితనం!!!

Exit mobile version