Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

క్రీడా భారతం

[శ్రీ రేడియమ్ రచించిన ‘క్రీడా భారతం’ అనే కవితని అందిస్తున్నాము.]

పిడుగుల్లారా
పిట్టల్లారా
చినుకుల్లో
చిత్తడిలో
చిందులు వేసే
చిరుతల్లారా

ఆట స్థలాలు
మోట బావులు
వెతికిన దొరకవు
నగరపు దారిన

ఆటల్లేవు
ఈతల్లేవు
చల్లని నీడల్లేవు
తోటల్లేవు

పిల్లల కితకితల
బుడతల పరుగుల
జాడల్లేవు
వాడల్లేవు

పల్లెల లోన
పట్నం లోన
గోడల నీడలు
బాటల్లో ఆటలు

డబ్బులకు
ఈత కొలను
ఆటల శిక్షణలు
అందరికి అందవు
కొందరికి అందును

నవ్వుల బాల్యం
ఆటల బాల్యం
ఎదిగే బాల్యం
వెలుగుల మయం
కావాలి ఆనందమయం

బాల భారతపు
భావి భారతపు
సూత్రదారులు
పాలకులు
గురువులు
మాతాపితలు

Exit mobile version