Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కుందనపు బొమ్మ

[శ్రీ కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం రచించిన ‘కుందనపు బొమ్మ’ అనే కవితను పాఠకులకు అందిస్తున్నాము.]

ర్ర చీర కట్టుకుని
మల్లెపూలు పెట్టుకుని
పండు వెన్నెలలో
పచ్చిక బయలుపై
కుందనపు బొమ్మలా
నిలబడి నాకోసం
నీవలా నిరీక్షిస్తుంటే
సీతాకోక చిలకలా
నీ ముందు వాలిపోనా
తుమ్మెదలా నీచుట్టూ
పరిభ్రమించనా
పిల్లతెమ్మెరలా
నిను చుట్టేయనా.. ప్రియా!

Exit mobile version