తెలుగు పూలతోట సాహిత్య వేదిక, జైనీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా నిర్వహించిన లక్ష్మీనారాయణ జైనీ స్మారక జాతీయ స్థాయి కవితల పోటీలో విజేతలు వీరే.
- మొదటి బహుమతి (రూ.3000 ) ఆవాల శారద-విజయవాడ (నాన్న కల – కవిత),
- రెండవ బహుమతి (రూ.2000), యాములపల్లి నరసిరెడ్డి-అనంతపురం (కడుపు నొప్పి – కవిత),
- మూడవ బహుమతి (రూ.1000) పుచ్చ కుమారస్వామి-వరంగల్ (ఆమె – కవిత)
ఈ పోటీలకు న్యాయనిర్ణేతగా డా. ఏనుగు నర్సింహారెడ్డి వ్యవహరించారు.
విజేతలకు నగదు బహుమతులు ఫౌండేషన్ చైర్మన్ డా. ప్రభాకర్ జైనీ గారు త్వరలో అందిస్తారని నిర్వాహకులు వెన్నెల సత్యం, శాంతి కృష్ణలు తెలిపారు. వివరాలకు 9440032210, 9502236670 నెంబర్లలో సంప్రదించాలి.