[శ్రీ కనపర్తి రాజశేఖరమ్ రచించిన ‘లేనిది వద్దు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
పైకి వస్తానంటే
చేయి అందిస్తా
పడిపోతే
లేపడానికి
బలం లేదు
బలగం లేదు
తోలుతానంటే
బండి చేతికిస్తా
చెడిపోతే
నడపడానికి
మరలేదు
మరమ్మతు లేదు
ఉంటానంటే
అవకాశమిస్తా
విడిపోతే
రమ్మనడానికి
మాట లేదు
ముచ్చట లేదు
