[గిద్దలూరు సాయి కిషోర్ రచించిన ‘లోతైన బంధం!’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
ఒంటరిగా అన్వేషిస్తుంటే
తోడుంటూ
బాధలో ఉన్న
సంతోషాన్ని పంచుకుంటూ
ఫ్రెండు నుండి మామ దాకా
సాగిపోతుంది స్నేహం..
లెక్కలు రాని ఫ్రెండు తో
అల్లరి చేసిన రోజులు..
ఏ ఊరు ఏ పట్నం దోస్తాన్
అనే నుండి
తిట్టుకున్నా క్షణాలు..
ముచ్చట్లు పెట్టుకొని,
సరదాగా గంతులు వేసిన రోజులు
పాఠశాలలో
తిథి వారాలతో, సూక్తి మొదలుకొని జాతీయగీతాన్ని పాడిన రోజులు..
దాగుడుమూతలు, పరుగుపందాలు, సంగీతానృత్యాలు, నాటికలు
ఇరువురి స్నేహితుల పోటీతత్వంతో
చదువును అభ్యసిస్తూ
విజయ కెరటాలను అధిరోహిస్తూ
ఉన్నత స్థాయికి, ఎదుగుదలకు ప్రేరేపిస్తూ
ఇలా ఎన్నో ఎన్నెన్నో
ఆ(సోదరి)
స్నేహితుడి వలన
జ్ఞాపకాలను నెమరేసుకుంటూ
మస్తిష్కంలో భద్రపరచుకుంటూ
ఏళ్ళకాలం సాగిపోతుంది స్నేహం..
గిద్దలూరు సాయి కిషోర్ 2004 జూన్ 3వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో జన్మించారు. గిద్దలూరు మురళి, లక్ష్మి వీరి తల్లిదండ్రులు. గిద్దలూరు నందిని వీరి చెల్లెలు. ఆమె చిత్రలేఖనంలో ప్రతిభ కనబరుస్తున్నారు. సాయి కిషోర్ బాల్యం నుంచే సాహిత్య ప్రపంచం వైపు ఆకర్షితుడయ్యారు. తాత్వికత, సమాజం, ప్రకృతి, కాలం వంటి అంశాలను తన కలం ద్వారా ప్రతిబింబింపచేస్తున్నారు. కవిత్వం, కథలు, తాత్విక ఆలోచనలు వీటన్నిటిలోనూ ఆయనకు ప్రత్యేక ప్రతిభ ఉంది. వీరి పదాలు సున్నితమైన భావవ్యక్తీకరణతో పాఠకుడిని ఆలోచనలోకి నడిపిస్తాయి. తెలుగు భాషా సౌందర్యాన్ని ఆధునిక భావాలతో మేళవించడం ఆయన రచనల ముఖ్య లక్ష్యం.
సాయి కిషోర్, అనంతపురం జిల్లాలోని లేపాక్షి ఫౌండేషన్లో ప్రచార కార్యదర్శిగా తెలుగు భాషా అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. సాహిత్యంతో పాటు విజ్ఞానం, విద్య, సాంకేతికత పట్ల కూడా ఆయనకు ఆసక్తి ఉంది. వీరి సృజనలో “ఆశయమే పిడికిలి”, “నాన్నే నాకు ఓ బిరుదు”, “మట్టే మనిషోయ్”, “కాల ప్రవాహం” వంటి రచనలు ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాయి.
