Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మా బతుకులు మారేదెన్నడు?

[ప్రొఫెసర్ పంజాల నరసయ్య గారు రచించిన ‘మా బతుకులు మారేదెన్నడు?’ అనే కవితని అందిస్తున్నాము.]

కాలాలు మారుతున్నాయి,
ఋతువులు మారుతున్నాయి,
పంచాంగాలు మారుతున్నాయి,
కానీ, మారనివి మాత్రం పేదల బతుకులే!

కవులు పుట్టారు, గిట్టారు,
కవులు పుడుతూనే ఉన్నారు.
మా గోస గురించి కవితలు, కథలు, నవలలు రాశారు;
ఇంకా రాస్తూనే ఉన్నారు.

మా గురించి పట్టించుకుంటున్నది
వారే.. వారే మా వారు.
వారి ‘రాతలు’ మా తలరాతలను
మార్చవంటున్నారు.. నిజమేనేమో!

మా ప్రశ్న:
ఎవరు మార్చాలి?

పట్టించుకోవలసిన వారు
మొహం చాటేస్తున్నారు,
మా మానాన మమ్మల్ని వదిలేసి.

మేము కూడా ఈ తల్లి బిడ్డలమే
అని చెప్పుకోవలసి వస్తున్నది;
ఎంతటి సిగ్గుచేటు!

Exit mobile version