Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మానులారా జ్ఞానులారా

[శ్రీ రవికిరణం రచించిన ‘మానులారా జ్ఞానులారా’ అనే గేయాన్ని అందిస్తున్నాము]

పల్లవి:
మానులారా జ్ఞానులారా
పాదులారా సాదులారా
అనుపల్లవి:
ఎండైన వానైన తపమిడని త్యాగులారా
కరువైన చెరువైన జపమిడని యోగులారా ॥మానులారా॥
చరణం1:
పక్షులకు గూడువై భిక్షులకు మేడవై
పశువులకు నీడవై పరమాత్మ జాడలౌ ॥మానులారా॥
చరణం2:
మలిన జలములు తాగి మధుర ఫలములనిచ్చి
మరణ వాయువు మేసి మనిషికి ఆయువు పోసే ॥మానులారా॥
చరణం3:
పెళ్ళింట పందిరై దాంపత్య దండవై
విందులో విస్తరై అందరికి నేస్తమౌ ॥మానులారా॥
చరణం4:
భోగులకు రసమువై రోగులకు పసరువై
వీణవై వేణువై ప్రాణికే ప్రాణమౌ ॥మానులారా॥
చరణం5:
ఒంటిపై బట్టలై వంటకై మట్టలై
కడనాడు కట్టెలై విడిపోని సుట్టమౌ॥మానులారా॥

Exit mobile version