Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘మా తోటి అడవి గూడ నవ్వింది’ – కొత్త ధారావాహిక ప్రారంభం – ప్రకటన

డా. మంథా భానుమతి ప్రమదాక్షరి సంయుక్తంగా నిర్వహించిన మినీ నవలల పోటీలో సంయుక్త చతుర్థ బహుమతి గెల్చుకున్న రచన ‘మా తోటి అడవి గూడ నవ్వింది’. రచన డా. ప్రభాకర్ జైనీ.

~

“పల్లెటూల్లల్ల చానా జాగ్రత్తగ మెదలవలసి ఉంటది. మన వల్ల ఏదైన పొరపాటు జరిగినప్పుడయితే, ఇంక జెర గుంభనంగ జీవితం గడపాలే. కొన్ని వేల కండ్లు మనను గుచ్చి గుచ్చి చూస్తనే ఉంటయి. బోళాగ కనపడే మనుషులు, వారి అమాయకపు మాటల తీరు, ఒలకబోసేటి ప్రేమలూ అన్నీ బూటకమే. వారిని నమ్మి మన మనసులోని మాట బయటపెడితిమా, తెల్లారేటాలకు అది కార్చిచ్చై, మననే దహించి వేస్తది. మంచైనా అంతే, చెడైనా అంతే. కాకపోతే, మన బతుకు బజారు పాలైనప్పుడు మాత్రం, నిజాయితీగనె ఓదారుస్తరు.

అందుకనె, తెల్లారి, మేము మా ఊరికి డైరెక్టుగ పోలే.  మా ఊరు సారంగాపూర్ అడవి దాటిన తర్వాత కొంత సేపటికి వస్తది.

బస్సు సారంగపూర్ అడివి మధ్యల నుండి పోతాంటె, నా హృదయం భగభగ మండింది. నాకు అపచారం జరుగుతాంటె, నిశ్శబ్ద సాక్షిగ నిలబడ్డ గా అడివిని నా హృదయం లెక్కనె భగభగ మండి నాశనమయిపోవాల్నని శపించాలన్నంత కోపం వచ్చింది. కని గిప్పుడు ఏం అనుకోని ఏం లాభం? అయినాగనీ, అడివికి కోపం, దుఃఖం, సంతోషం, నవ్వు, ఏడ్పు ఉంటయా? నా పిచ్చిగని. అడివికి హృదయం ఉండదు. అదొక ప్రాణమున్న నిర్జీవి లెక్క, గంతే! అని అనకున్న. “

~

మంచి ఉత్కంఠతతో సాగే నవలిక. ఆసక్తిగా సాగే కథనం చదివింపచేస్తుంది.

వచ్చే వారం నుంచే..

చదవండి.. చదివించండి..

‘మా తోటి అడవి గూడ నవ్వింది’

Exit mobile version