Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మచ్చుక్కొన్ని

[శ్రీ కనపర్తి రాజశేఖరమ్ రచించిన ‘మచ్చుక్కొన్ని’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

చెప్పింది శ్రద్ధగా విను
ఆలోచించి మాట్లాడు
ఇష్టానుసారం వాగితే
వాక్కు స్వాతంత్ర్యానికి
భంగం ఏర్పడుతుంది

చేసింది సరిగా చూడు
నిపుణత్వాన్ని గుర్తించు
నిర్హేతుకంగా నిందవేస్తే
వక్రంలేని వ్యక్తిత్వానికి
వంకొకటి పుడుతుంది

పెట్టింది చక్కగా తిను
అమృతంగా భావించు
అన్నదాతను స్మరించు
మెతుకు లేని బతుకు
కొరగాకుండా పోతుంది

Exit mobile version