శ్రీ విశ్వనాథ సాహిత్యపీఠము ఆధ్వర్యములో తేది: 11-07-2026, మంగళవారం నాడు సాయంత్రం 6 గంటలకు విశాఖపట్టణము లోని ద్వారకానగర్‌లో గల జిల్లా పౌర గ్రంథాలయం ప్రాంగణంలో శ్రీ ఫణిహారం వల్లభాచార్య గారి ‘మధుకశ’ (పరివర్థిత ముద్రణ), శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారి ‘విశ్వనాథ భావుకత’ అనే పుస్తకాల ఆవిష్కరణ సభ జరుగుతుంది.
సభాధ్యక్షులు:
డా. డి. వి. సూర్యరావుగారు
ముఖ్యఅతిథి, పుస్తకావిష్కరణ:
ఆచార్య బేతవోలు రామబ్రహ్మం
‘మధుకశ’ పుస్తక సమీక్ష:
ఆచార్య బేతవోలు రామబ్రహ్మం
‘విశ్వనాథ భావుకత’ పుస్తక సమీక్ష:
శ్రీమతి పేరాల హరిప్రియ
~
సాహిత్యాభిమానులందరికీ ఇదే మా సాదర స్వాగత సుమాంజలి.
శ్రీ పేరాల శ్రీ వేంకట బాలకృష్ణ, అధ్యక్షులు
పేరాల సీతారామప్రభు, కార్యదర్శి
శ్రీమతి పేరాల హరిప్రియ, సహాయ కార్యదర్శి
శ్రీ విశ్వనాథ సాహిత్య పీఠము

